ఆది సాయి కుమార్ (Adi Sai Kumar) లేటెస్ట్ మూవీ “టాప్ గేర్” (Top Gear).. ఆసక్తికరంగా టీజర్!

Updated on Dec 03, 2022 05:56 PM IST
“టాప్ గేర్” (Top Gear Teaser) టీజర్‌ను చూసిన మారుతి చిత్రయూనిట్‌ను అభినందించాడు. టీజర్ బాగుందని మెచ్చుకున్నాడు.
“టాప్ గేర్” (Top Gear Teaser) టీజర్‌ను చూసిన మారుతి చిత్రయూనిట్‌ను అభినందించాడు. టీజర్ బాగుందని మెచ్చుకున్నాడు.

ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “టాప్ గేర్” (Top Gear). ఈ చిత్రంలో ఆదికి జోడి రియా సుమన్ నటించింది. ఇక, ఈ చిత్రానికి చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే ఓ పాట, గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా మరో సరికొత్త అప్డేట్‌ను తీసుకువచ్చింది. డిసెంబర్ 30న విడుదల కాబోతున్న ‘టాప్ గేర్’ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా ‘టాప్ గేర్’ టీజర్‌ను విడుదల చేయించింది చిత్రబృందం.

ఒక నిమిషం 21సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యురియాసిటీ పెంచేస్తున్నాయి. కార్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. విజువల్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

టాప్ గేర్” (Top Gear Teaser) టీజర్‌ను చూసిన మారుతి చిత్రయూనిట్‌ను అభినందించాడు. టీజర్ బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రయూనిట్ మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. టీజర్ చాలా బాగా కట్ చేశారని, టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతోందని అన్నాడు. ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Read More: Tees Maar Khan Trailer: 'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన ఆది సాయికుమార్ (Aadi Saikumar), పాయల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!