మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా నటించిన జిన్నా సినిమా విడుదల ఆలస్యం? పోస్ట్‌పోన్ చేయనున్నారని టాక్!

Updated on Sep 26, 2022 04:13 PM IST
మోసగాళ్లు సినిమా ప్లాప్ తర్వాత విష్ణు (Vishnu Manchu) నటిస్తున్న సినిమా జిన్నా. పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు
మోసగాళ్లు సినిమా ప్లాప్ తర్వాత విష్ణు (Vishnu Manchu) నటిస్తున్న సినిమా జిన్నా. పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు

చాలాకాలం తర్వాత జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మంచు విష్ణు (Vishnu Manchu). మోసగాళ్లు సినిమాతో భారీ ప్లాప్​ను తన ఖాతాలో వేసుకున్న విష్ణు.. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇషాన్‌ సూర్య అనే కొత్త దర్శకుడితో హర్రర్ కామెడీ జానర్‌‌ సినిమాలో నటించారు. జిన్నా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌‌ ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాయి.

జిన్నా సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. దానికి తగినట్టుగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది చిత్ర యూనిట్. అయితే జిన్నా సినిమా విడుదలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

మోసగాళ్లు సినిమా ప్లాప్ తర్వాత విష్ణు (Vishnu Manchu) నటిస్తున్న సినిమా జిన్నా. పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు

ఇద్దరు స్టార్లతో..

దసరా పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్, కింగ్ నాగార్జున హీరోగా చేసిన ది ఘోస్ట్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అందులోనూ గాడ్‌పాదర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, గ్లింప్స్, టీజర్‌‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మలయాళ సినిమా లూసిఫర్‌‌కు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కడంతో సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి.

ఇక, నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ చేస్తున్న యాక్షన్ సీన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాదు, ది ఘోస్ట్‌ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు నాగార్జున. ఇటీవలే అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించారు. వాళ్లు కూడా సినిమా చూసి ఫిదా అయ్యారని టాక్. దీంతో ది ఘోస్ట్‌ సినిమాపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇద్దరు స్టార్ హీరోలు, వాళ్లు నటించిన భారీ సినిమాలు విడుదలవుతున్న సమయంలో జిన్నా సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్‌ కాదని మేకర్స్ అనుకుంటున్నారని టాక్. అందుకే జిన్నా సినిమాను రెండు వారాలు పోస్ట్‌పోన్ చేసి అక్టోబర్‌‌ 21వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. జిన్నా సినిమాలో మంచు విష్ణు (Vishnu Manchu) కు జోడీగా సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటించారు.

Read More : 'జిన్నా'(Ginna) టీజర్ లాంఛ్ కార్యక్రమంలో సందడి చేసిన మంచు విష్ణు (ManchuVishnu), పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!