సరదాసరదాగా ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) ‘క్రేజీ ఫెలో’ సినిమా టీజర్

Updated on Sep 01, 2022 02:32 PM IST
యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)  ప్రేమకావాలి సినిమాతోనే హిట్ అందుకున్నారు
యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) ప్రేమకావాలి సినిమాతోనే హిట్ అందుకున్నారు

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో న‌టిస్తున్న సినిమాల్లో ఒక‌టి క్రేజీ ఫెలో. ఫ‌ణి కృష్ణ సిరికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం విడుదల చేశారు మేక‌ర్స్.

‘ఒక పంచ్ లైన్‌లో మ‌నోడి గురించి చెప్పాలంటే.. మందు తాగితే లివ‌ర్ పోద్ది, సిగ‌రెట్ తాగితే లంగ్స్ పోతాయి.. వీడితో ఉంటే దూల తీరిపోతుంది’అంటూ హీరో క్యారెక్టర్‌‌ను సాయికుమార్ వాయిస్ పరిచయం చేస్తుంది. ఫన్‌, ల‌వ్‌, అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా క్రేజీ ఫెలో సినిమా తెరకెక్కుతోందని టీజ‌ర్ ద్వారా తెలుస్తోంది.

యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)  ప్రేమకావాలి సినిమాతోనే హిట్ అందుకున్నారు

అక్టోబర్‌‌ 14న రిలీజ్..

క్రేజీ ఫెలో సినిమాలో దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. స‌ప్తగిరి, న‌ర్రా శ్రీనివాస్‌, అనీష్ కురువిల్ల, వినోదిని వైద్యనాథ‌న్‌, ర‌విప్రకాశ్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌ క్రేజీ ఫెలో సినిమాను తెరకెక్కిస్తోంది.  ధ్రువ‌న్ మ్యూజిక్ అందిస్తున్న ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) క్రేజీ ఫెలో సినిమా అక్టోబ‌ర్ 14న థియేట‌ర్లలో విడుద‌ల కానుంది.

Read More : ట్విటర్‌‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఆది సాయికుమార్ (Aadi Sai Kumar).. వీడియో షేర్ చేసిన యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!