టాక్సీ డ్రైవర్‌‌గా ఆది సాయికుమార్ (Aadi SaiKumar).. ఆసక్తిగా ‘టాప్‌గేర్‌‌’ సినిమా 3డీ మోషన్‌ పోస్టర్

Updated on Oct 06, 2022 11:56 PM IST
యంగ్‌ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ వాటిని పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
యంగ్‌ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ వాటిని పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.

ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆది సాయికుమార్‌ (Aadi SaiKumar). మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఆ తర్వాత పలు డిఫరెంట్‌ సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది.. మరికొద్ది రోజుల్లో టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే విభిన్నమైన కథాంశంతో టాప్‌గేర్‌‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు.

టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి 3డీ మోషన్‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు మేకర్స్. మోషన్  పోస్టర్‌‌లో కారు నడుపుతున్న ఆది (Aadi SaiKumar).. యాక్షన్ మోడ్‌తో ఆకట్టుకున్నారు. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే టాప్‌గేర్‌‌ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.

Read More : Tees Maar Khan Trailer: 'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన ఆది సాయికుమార్ (Aadi Saikumar), పాయల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!