Hebah Patel: గ్లామర్ ఫోటోలతో హీటెక్కిస్తున్న 'కుమారి 21ఎఫ్' భామ హెబ్బా పటేల్..!

Published on Jun 15, 2022 09:31 PM IST

Hebah Patel: టాలీవుడ్ లోకి ‘అలా ఎలా’ అనే చిన్న మూవీతో ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. ఆ తరువాత సుకుమార్ బ్యానర్ లో చేసిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్టు కొట్టింది. అనంతరం ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’, ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’.. వంటి హిట్ చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే, ‘కుమారి 21ఎఫ్’ తో ఈ బ్యూటీ సంపాదించుకున్న క్రేజ్ వల్ల.. వచ్చిన ప్రతీ ఆఫర్ కు ఓకే చెప్పేసి ఈమె తప్పు చేసిందనే చెప్పాలి.

అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. హెబ్బా ఆ మధ్యన రామ్ పోతినేని రెడ్ (RED Movie) మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో నటిస్తోంది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

అయితే.. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు అయితే దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉందట. తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ ను పోస్ట్ చేసింది. రెడ్ జాకెట్ ధరించిన హెబ్బా.. జిప్ ఓపెన్ చేసి దాగున్న పరువాలని చూపిస్తూ సెల్ఫీలతో తెగ పిచ్చెక్కిస్తోంది. ఈ పిక్స్ లో హెబ్బా బ్యూటీ క్వీన్ లాగా వెలిగిపోతోంది మరి. 

హెబ్బా పటేల్ ఈ పిక్స్ లో కొంచెం బొద్దుగా మారినట్లుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా హెబ్బా పటేల్ (Hebba Patel) న్యూ లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.. అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం అయితే ఖాయం. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో నటిస్తోందట.

Read More: Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత .. చెన్నై బిర్యానీ తినిపించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ..!