Payal Rajput: 'పచ్చళ్ల స్వాతి'గా పాయల్ రాజ్ పుత్... 'జిన్నా' (Ginna) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!

Updated on Aug 09, 2022 02:57 PM IST
'జిన్నా' (Ginna) సినిమా నుంచి తాజాగా పాయల్ (Payal Rajput First Look) ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
'జిన్నా' (Ginna) సినిమా నుంచి తాజాగా పాయల్ (Payal Rajput First Look) ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ (Ginna) . ఈ మూవీ లో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. సన్నీ లియోన్‌ (Sunny Leone) కీలక పాత్ర పోషిస్తోంది. ఇక, ఈ సినిమాలో గాలి నాగేశ్వరావు అనే పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన మంచు విష్ణు ఫస్ట్‌ లుక్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది. 

'జిన్నా' సినిమా నుంచి తాజాగా పాయల్ (Payal Rajput First Look) ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విష్ణు సరసన పాయల్ పచ్చళ్ల స్వాతి పాత్రలో కనిపించనుంది. ఈ ఫస్ట్ లుక్ లో లంగా ఓణీలో వయ్యారంగా చూస్తున్న పాయల్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆ పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్లో పాయల్ షేర్ చేసింది. ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ఫ్రెంచ్ కావాలి. అతని కొంటె పనుల్లో పాలు పంచుకోవాలి. జిన్నా తోడుదొంగ స్వాతిని పరిచయం చేస్తున్నా’ అని పాయల్ ట్వీట్ చేసింది.

'ఆర్ఎక్స్ 100' (RX100) బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో ఈ భామ తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన ఒకటి రెండు సినిమా పాయల్‌ రాజ్‌పుత్‌కి పేరు తెచ్చిపెట్టకపోవడంతో.. ఈరకంగా సోషల్ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు షేర్ చేస్తూ అబ్బాయిల గుండెల్లో అగ్గి రాజేస్తోంది.

మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu) చాలా కాలంగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. విష్ణు సినిమా కోసం అతని అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు రచయిత కోన వెంకట్‌ (Kona Venkat) కథ, కథనం అందించడంతో పాటు ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మంచు విష్ణు ఫస్ట్‌ లుక్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది.

Read More: Payal Rajput: కన్నడ ఇండస్ట్రీలోకి పాయ‌ల్ రాజ్‌పుత్‌ ఎంట్రీ.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్న 'RX 100' బ్యూటీ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!