Sunny Leone: మంచు విష్ణు జిన్నా (Ginna) సినిమా నుంచి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ విడుదల..!

Updated on Aug 10, 2022 05:47 PM IST
సన్నీ లియోన్ (Sunny Leone) ఈ పోస్టర్ లో అందమైన పింక్, తెలుపు ప్లేసూట్ ధరించి, ఎప్పటిలాగే సంచలనాత్మకంగా కనిపిస్తోంది.
సన్నీ లియోన్ (Sunny Leone) ఈ పోస్టర్ లో అందమైన పింక్, తెలుపు ప్లేసూట్ ధరించి, ఎప్పటిలాగే సంచలనాత్మకంగా కనిపిస్తోంది.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ (Ginna). ఇషాన్ సూర్య (Ishan Surya) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎవిఎ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ (Payal Rajput), బాలీవుడ్ నటి స‌న్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. విష్ణు సరికొత్త లుక్ లో కనిపిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు మంచు విష్ణు.  

ఇక, 'జిన్నా' సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ హల్ చల్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి విడుద‌లైన పాయ‌ల్ రాజ్‌పుత్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. కాగా ఇపుడు త‌న అందాల‌తో కుర్ర‌కారును ఫిదా చేసే స‌న్నీలియోన్ పోస్ట‌ర్ (Sunny Leone look) కూడా వ‌చ్చేసింది. ఈ చిత్రంలో రేణుక అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తోంది స‌న్నీలియోన్‌.

సన్నీ లియోన్ (Sunny Leone) ఈ పోస్టర్ లో అందమైన పింక్, తెలుపు ప్లేసూట్ ధరించి, ఎప్పటిలాగే సంచలనాత్మకంగా కనిపిస్తోంది. పల్లెవెలుగు బస్సులో నుంచి ఇప్పుడే దిగుతున్నట్లుగా సన్నీ లుక్ ఉంది. ‘రేణుకను మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను జిన్నా చిన్ననాటి స్నేహితురాలిని..కానీ నేన‌తని జీవితాన్ని తలకిందులు చేయనని కాదు.. ఊహించని మలుపులు, ట్విస్టుల‌తో ఈ ప్ర‌యాణం క్రేజీగా ఉండబోతోంది..’అంటూ ట్వీట్ చేసింది స‌న్నీలియోన్‌.

ఇక, ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుండగా, సన్నీ లియోన్ సిటీ నుంచి ఇప్పుడే దిగిన అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read More: Manchu Vishnu: చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలతో తలపడనున్న మంచు విష్ణు 'జిన్నా'(Ginna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!