Tees Maar Khan Trailer: 'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన ఆది సాయికుమార్ (Aadi Saikumar), పాయల్!

Updated on Aug 09, 2022 04:11 PM IST
'తీస్ మార్ ఖాన్' (Tees Maar Khan)చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌లో మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి వావ్ అనిపించాడు హీరో ఆది.
'తీస్ మార్ ఖాన్' (Tees Maar Khan)చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌లో మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి వావ్ అనిపించాడు హీరో ఆది.

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar), ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ఈ మూవీకి ‘నాటకం’ సినిమా దర్శకుడు కళ్యాణ్ జి గోగున దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్ లో నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి.  

తాజాగా 'తీస్ మార్ ఖాన్' (Tees Maar Khan) చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక, ఈ ట్రైలర్‌లో మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి వావ్ అనిపించాడు హీరో ఆది. ఒక స్టూడెంట్‌గా, ఒక రౌడీగా, ఒక పోలీస్‌గా ఆది మూడు షేడ్స్ చూపించడంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ మరోసారి అందాల విందు చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోనే అమ్మడి అందాల ఆరబోతకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan) మూవీలో రూత్ లెస్ పోలీస్ అధికారిగా ఆది రోల్ ఉంది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. సునీల్, పూర్ణ కీలకర్ రోల్స్ చేస్తున్న తీస్ మార్ ఖాన్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. 

2 నిమిషాల 42 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ (Tees Maar Khan Trailer) లో ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. మా అమ్మను తప్పుగా చూశారు.. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకైనా కొడతా అంటూ పదునైన డైలాగ్ తో ఆది సాయి కుమార్ ఎంట్రీ చూపించి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ అనేది చెప్పేశారు. పోలీస్ గా ఆది సాయి కుమార్ ఎలివేషన్ హైలైట్ చేస్తూనే కామెడీ పండించడం ఆసక్తికరంగా మారింది.మరి ఈ మూవీతో అయినా ఆది హిట్ కొడతాడేమో చూడాలి. 

Read More: Tees maar Khan: దుమ్ము రేపుతున్న హీరో ఆది 'తీస్‌మార్ ఖాన్' టీజర్.. పాయల్ రాజ్‌పుత్‌‌తో రొమాన్స్ అదుర్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!