మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ‘జిన్నా’ టీజర్ విడుదల ఎప్పుడంటే?

Updated on Aug 19, 2022 11:07 PM IST
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ‘జిన్నా’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ‘జిన్నా’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న జిన్నా సినిమా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో  తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించారు’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. జిన్నా సినిమాకు సంగీతం అనూప్‌ రూబెన్స్ అందిస్తున్నారు.

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ‘జిన్నా’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది

మీమ్స్‌ బాగా పాపులర్..

కాగా, త్వరలో జిన్నా సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే టీజర్‌‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి విష్ణు (Manchu Vishnu), పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ చేసిన మీమ్స్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి.

Read More : Manchu Vishnu: చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలతో తలపడనున్న మంచు విష్ణు 'జిన్నా'(Ginna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!