'వినరో భాగ్యము విష్ణు కథ‌' సినిమా అప్డేట్ .. చిత్తూరు యాస‌లో అదరగొడుతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) !

Updated on Jul 15, 2022 02:53 PM IST
'వినరో భాగ్యము విష్ణు కథ‌'లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కు జోడిగా క‌శ్మీర ప‌ర‌దేశీ న‌టిస్తున్నారు.
'వినరో భాగ్యము విష్ణు కథ‌'లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కు జోడిగా క‌శ్మీర ప‌ర‌దేశీ న‌టిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) న‌టిస్తున్న 'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మేక‌ర్స్ తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ వీడియోని విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై  నిర్మాత బ‌న్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌‌టైనర్‌గా విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ సినిమాని తెర‌కెక్కించారు.

చిత్తూరు యాస‌లో డైలాగులు
'ఏడు వింతల గురించి మాకు తెలియదు .. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి' .. 'మాది తిరుపతి .. నా పేరు విష్ణు .. ఇంకొన్ని రోజుల్లో మీరంతా చూడబోయేదే నా కథ' అంటూ హీరో వాయిస్ పై విడుద‌ల చేసిన‌ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. చిత్తూరు యాస‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైలాగులు భలే గమ్మత్తుగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్‌
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కు జోడిగా ఈ చిత్రంలో క‌శ్మీర ప‌ర‌దేశీ న‌టిస్తున్నారు. తెలుగులో ఈమె నటిస్తున్న తొలి  చిత్రం ఇదే. 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.
 
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) 'రాజావారు రాణిగారు' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత 'సెబాస్టియ‌న్' చిత్రంతో ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. ఇటీవలే రిలీజ్ అయిన 'స‌మ్మ‌త‌మే' సినిమాలో కూడా కిరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ హీరో మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు.  ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ అనే టైటిల్‌తో నిర్మిస్తున్న సినిమాకి ఆయన సైన్ చేశారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ఆడియ‌న్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. ప్ర‌ముఖ లెజండ‌రీ ద‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More: Kiran Abbavaram: 'సమ్మతమే' మూవీ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్న 'కిరణ్ అబ్బవరం'

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!