రెండేళ్ల తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న నేషనల్ అవార్డు అందుకున్న మూవీ ‘కలర్ ఫోటో’ (Colour Photo)..!

Updated on Oct 25, 2022 11:53 AM IST
‘కలర్ ఫోటో’ (Colour Photo) చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు సైతం వరించిన సంగతి తెలిసిందే.
‘కలర్ ఫోటో’ (Colour Photo) చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు సైతం వరించిన సంగతి తెలిసిందే.

‘కలర్ ఫోటో’ (Colour Photo).. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ అందుకుంది ఈ సినిమా. పీరియడ్‌ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్‌ డైరెక్ట్ చేశారు. నటుడు సుహాస్ (Suhas), షార్ట్ ఫిల్మ్స్‌ ఫేమస్ చాందినీ చౌదరీ (Chandini Chowdary) హీరో హీరోయిన్లుగా నటించారు. కరోనా సంక్షోభం కారణంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం 'ఆహా'లో విడుదల చేశారు. 

ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకోవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాను అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఇక, ఈ చిత్రంలో సునీల్, వైవా హర్ష, శ్రీదివ్య,  కీలకపాత్రలలో నటించగా.. కాలభైరవ సంగీతం అందించారు. 

పేద, ధనిక, కులాంతర, మతాంతర అంశాలను కాకుండా.. వర్ణ వివక్షను ఇతివృత్తంగా చేసుకుని ఈ ప్రేమకథను తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రాజ్ (Director Sandeep Raj). అప్పటివరకు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేసిన సందీప్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా, సుహాస్ కు హీరోగా తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

‘కలర్ ఫోటో’ (Colour Photo) చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు సైతం వరించిన సంగతి తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫొటో' ఈ అవార్డును గెలుచుకుంది. అయితే, ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కలర్ ఫోటో’ (Colour Photo) చిత్ర నిర్మాత సాయిరాజేశ్‌, సందీప్‌ రాజ్‌ ఈ సినిమా థియట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ను (Colour Photo Theatrical Release) ప్రకటించారు. నవంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో మూవీ లవర్స్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సినిమాను ఫ్యాన్స్ థియేటర్ లో ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.

Read More: ఆహా ఓటీటీలో 'చెఫ్ మంత్రా' (Chef Mantra) సీజన్ 2 ఫుడ్ షో.. హోస్ట్ గా అలరించనున్న మంచు లక్ష్మీ (Manchu Lakshmi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!