Major: 'మేజర్' 100 రోజులు పూర్తి..భావోద్వేగ ట్వీట్ చేసిన హీరో అడవి శేష్ (Adivi Sesh)
Major: టాలీవుడ్ హీరో అడవి శేష్ (Adivi Sesh) నటించిన 'మేజర్' సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై వంద రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'మేజర్' సినిమా 100 రోజుల స్పెషల్ పోస్టర్‌ను అడవి శేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలో లభించిన అత్యంత గొప్ప గౌరవం 'మేజర్' సినిమా అని అడవి శేష్ ట్వీట్ చేశారు.
ఆనందంలో అడవి శేష్
ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణత్యాగం చేసి ప్రజలను కాపాడిన 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కంది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన 'మేజర్' సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ దూసుకెళుతుంది. 'మేజర్' చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
'మేజర్' చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో అడవి శేష్ (Adivi Sesh) భావోద్వేగ ట్వీట్ చేశారు. 'మేజర్' సినిమా విడుదలై 100 రోజులు పూర్తయిందన్నారు శేష్. తానకు లభించిన అత్యంత గొప్ప గౌరవం 'మేజర్' సినిమా అంటూ ట్వీట్ చేశారు.
పలు రికార్డులు బ్రేక్ చేసిన మేజర్
Major: 'మేజర్' చిత్రంలో అడవి శేష్ (Adivi Sesh) కు జోడిగా సయి ముంజ్రేకర్ నటించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ, శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న 'మేజర్' చిత్రం 14 దేశాల్లో ట్రెండింగ్‌లో కొనసాగింది. సౌత్ ఏషియా సినిమాలలో టాప్ వన్ ప్లేస్‌లో 'మేజర్' ట్రెండ్ అయి చరిత్ర సృష్టించింది.
మేజర్ ఓ గొప్ప దేశభక్తి చిత్రం
Major: అడివి శేష్ అమెరికాలో పుట్టారు. అక్కడే పెరిగారు. ప్రముఖ తెలుగు రచయిత అడివి బాపిరాజు మనవడే అడివి శేష్. ఆయనపై తన తాత గారి ప్రేరణ ఎంతో ఉంది. విదేశాలలో ఉన్నప్పుడే, సినిమాలపై ఇష్టం పెంచుకున్న అడివి శేష్ హీరో అయ్యేందుకు ఇండియా వచ్చారు.
శేష్‌కు దేశభక్తి ఎక్కవ. అందుకే తన సినిమా కథలను కూడా దేశభక్తి ఇతి వృత్తంతో ఎంచుకుంటున్నారు. 'మేజర్' (Major) సినిమాతో శేష్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప దేశభక్తి చిత్రాన్ని తీశారు. ప్రస్తుతం అడవి శేష్ హిట్ 2, గూఢాచారి 2 సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.