‘బ్రహ్మాస్త్ర’తో పోటీపడనున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ సినిమా

Updated on Jul 17, 2022 12:15 AM IST
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’, బ్రహ్మాస్త్రం సినిమా పోస్టర్లు
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’, బ్రహ్మాస్త్రం సినిమా పోస్టర్లు

వరుస సినిమాలను ప్రకటిస్తూ, వాటి షూటింగ్‌లను పూర్తి చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). తాజాగా ‘సమ్మతమే’ సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్నారు కిరణ్. త్వరలో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీధర్‌‌ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాపై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. అయితే ఇటీవల రిలీజైన ట్రైలర్‌‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా విడుదల తేదీని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు కిరణ్ అబ్బవరం. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.  

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’, బ్రహ్మాస్త్రం సినిమా పోస్టర్లు

అదే రోజు ‘బ్రహ్మాస్త్ర’ కూడా..

‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ సినిమా రిలీజ్ అయ్యే రోజునే రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా విడుదల కాబోతోంది. బ్రహ్మాస్త్ర సినిమాను సెప్టెంబర్‌‌ 9వ తేదీన విడుదల చేయనున్నట్టు చాలా రోజుల క్రితమే చిత్ర యూనిట్ ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో, విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఆ సినిమా విడుదలయ్యే రోజునే నేను మీకు కావాల్సినవాడిని సినిమాను రిలీజ్ చేస్తుండడంపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

బ్రహ్మాస్త్ర సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. హిందీతోపాటు తెలుగులో కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటిస్తుండడం కూడా సినిమాకు తెలుగులో క్రేజ్ పెరగడానికి ఒక కారణం.

బ్రహ్మాస్త్ర సినిమాతో పోటీ పడి కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా లేదా తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మరి. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాలో కిరణ్‌కు (Kiran Abbavaram) జోడీగా సంజనా ఆనంద్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం కిర‌ణ్ ‘మీట‌ర్’, ‘రూల్స్ రంజ‌న్‌’, ‘విన‌రో భాగ్యము విష్ణు క‌థ’ సినిమాల్లో నటిస్తున్నారు.

Read More : చియాన్ విక్రమ్‌తో జోడీ కట్టనున్న కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).. రెమ్యునరేషన్ ఎంతంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!