కెరీర్‌‌ పరంగా ఆనందంగానే ఉన్నా.. యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

Updated on Jul 07, 2022 01:12 PM IST
తాజాగా లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) నటించిన సినిమా`హ్యాపీ బర్త్ డే`. `మత్తు వదలరా` వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన రితేష్ రానా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు
తాజాగా లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) నటించిన సినిమా`హ్యాపీ బర్త్ డే`. `మత్తు వదలరా` వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన రితేష్ రానా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన పది సంవత్సరాలలతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు లావణ్య. అలాగే ఆమె చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి కూడా. నానితో చేసిన ‘భలే భలే మగాడివోయ్’, నాగార్జునతో చేసిన సోగ్గాడే చిన్నినాయన వంటి హిట్‌ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

తాజాగా లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) నటించిన సినిమా`హ్యాపీ బర్త్ డే`. `మత్తు వదలరా` వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన రితేష్ రానా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. `హ్యాపీ బర్త్ డే` సినిమా జూలై  8 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో లావణ్య మీడియాతో చెప్పిన ముచ్చట్లు.. ఆమె మాటల్లోనే..

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) బర్త్‌డే సినిమా పోస్టర్

ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై యాక్షన్

మొదటిసారి గన్ పట్టుకోవడం కొత్తగా అనిపించింది. `హ్యాపీ బర్త్ డే` సినిమా కథ, కథనం కొత్తగా ఉంటాయి. నాకు జిమ్ బాక్సింగ్ చేసే అలవాటు ఉంది. అయితే మొదటిసారి స్క్రీన్‌పై యాక్షన్ చూపించే చాన్స్‌ ఈ సినిమాతో వచ్చింది. హ్యాపీ బర్త్‌ డే సినిమాలో `హ్యాపీ` అనే అమ్మాయి క్యారెక్టర్‌‌లో నటించాను. దర్శకుడు రితేష్‌ రానా చెప్పిన కథ బాగా నచ్చింది. కొత్త జోనర్. సర్రియల్‌ వరల్డ్ థాట్‌ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది.
 

ఈజీగానే హ్యాపీ క్యారెక్టర్ చేశా.. 
అలాగే తాను చేసిన పాత్రల గురించి కూడా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మాట్లాడారు. `నేను చేసిన క్యారెక్టర్ల వల్లే, చాలా మంది నన్ను సీరియస్ పర్సన్ అనుకుంటారు. అయితే నేను చాలా జోవియల్‌గా ఉంటాను. అందరితో జోక్స్ వేయడం ఇష్టం. ‘హ్యాపీ’ క్యారెక్టర్‌‌లో చాలా ఈజీగా నటించాను. క్యారెక్టర్‌‌లో చాలా ఫన్ ఉంటుంది. ఈ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఫీమేల్‌ లీడ్ రోల్‌ సినిమాలంటే, దాదాపు అందరికీ సీరియస్ క్యారెక్టర్‌‌లే వస్తుంటాయి. ఇలాంటి క్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్ కథలో లీడ్‌ రోల్‌ చేయడం సంతోషంగా ఉంది.

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అందాల రాక్షసి సినిమా పోస్టర్

‘అందాల రాక్షసి’గా నటించడానికి..
మొదటి సినిమా `అందాల రాక్షసి`లో `మిథున` క్యారెక్టర్‌‌ చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఆ సినిమాలో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. తర్వాత చేసిన పాత్రలన్నీ ఈజీగానే చేశాను. చాలా రోజుల తర్వాత 'హ్యాపీ' క్యారెక్టర్‌‌ మళ్ళీ కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో కూడా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా.

గన్స్ క్యారీ చేయడం..
‘హ్యాపీ బర్త్‌ డే’ సినిమాలో క్యారెక్టర్‌‌లో చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. మేకప్ మాత్రం కష్టంగా అనిపించింది. గన్స్ క్యారీ చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. ఒక్కో గన్ 9 కేజీల వరకూ ఉంటుంది. దాన్ని మోస్తూ షూట్ చేయడం అంత ఈజీ కాదు.

 

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) భలే భలే మగాడివోయ్ సినిమా పోస్టర్

మనసుకు నచ్చిన క్యారెక్టర్లే చేస్తున్నా..

ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్లు గడిచింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ నంబర్‌‌ వన్‌ స్థానానికి చేరుకోవాలని లేదు. నా వర్క్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా, మనసుకు నచ్చిన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా కెరీర్‌‌తో సంతృప్తికరంగానే ఉన్నాను.

కథల ఎంపికలో..
ప్రస్తుతం చాలా కథలు వింటున్నాను. అయితే  కొన్ని కథల ఎంపికలో మాత్రం కరాకండీగా ఉంటాను. నటిగా మంచి క్యారెక్టర్లు చేయాలని అనుకుంటాను. చేసిన క్యారెక్టర్లే చేయాలంటే నచ్చదు. అందుకే విభిన్నమైన క్యారెక్టర్ల కోసం చూస్తుంటాను. ఈ సమస్య వల్లే నాకు సినిమాలు తగ్గుతున్నాయని ఓ క్రమంలో అనిపించింది.

అలాంటి సందర్భంలో `హ్యాపీ బర్త్ డే` చిత్రంలో అవకాశం వచ్చింది.  సర్రియల్ ప్రపంచానికి సంబంధించిన కాన్సెప్టుతో  ‘హ్యాపీ బర్త్ డే’  సినిమా సాగుతుంది. ఆ ప్రపంచానికి ఎటువంటి హద్దులు ఉండవు. ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నకు బదులు ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఊహకు హద్దులు ఉండవు కదా. ఈ సినిమాలో అది కొంచెం కొత్తగా ఉంటుంది.

అక్కినేని నాగార్జునతో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

ఇక, ‘హ్యాపీ బర్త్ డే’ విమెన్ సెంట్రిక్ సినిమా కాదు. ఇందులో పాత్రలన్నీ హీరోలే. క్యారెక్టర్ బేస్డ్‌గా తెరకెక్కించిన సినిమా ఇది. ఫ్యూచర్‌‌లో నేను ఇలాంటి క్యారెక్టర్లు వస్తే తప్పకుండా చేస్తాను. కానీ ఇటువంటి సినిమాలే చేయాలని ప్లాన్‌ చేసుకోను. వాటి గురించి ఆలోచించను. కానీ యాక్షన్‌ సినిమాలు చేయడం మాత్రం చాలా ఇష్టం` అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).

Read More : మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు (Ilayaraja) అరుదైన గౌరవం.. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!