కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) జోష్ ! ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Updated on Sep 08, 2022 08:07 PM IST
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) , సోనూ ఠాకూర్ జంట‌గా న‌టించారు.
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) , సోనూ ఠాకూర్ జంట‌గా న‌టించారు.

Nenu Meeku Baga Kavalsinavaadini: టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) న‌టించిన సరికొత్త సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఈ  సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రిలీజ్ చేశారు. ఈ విష‌యాన్ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌కు తెలిపారు.

శ్రీధ‌ర్ గాదే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సెప్టెంబర్  15న విడుద‌ల కానుంది. హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘రాజావారు రాణిగారు’, ‘SR క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

దుమ్మురేపుతున్న పాట‌లు

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సోనూ ఠాకూర్ జంట‌గా న‌టించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్లు, పాట‌లు సినిమాపై జనాలకు ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేశాయి. సినిమా హిట్టా.. ఫ‌ట్టా అనే విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నానని కిర‌ణ అబ్బ‌వ‌రం ఈ సందర్భంగా తెలిపారు. వ‌రుస సినిమాల‌తో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. 

ట్రైల‌ర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదగా మేకర్స్ “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. స్టార్ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర‌లో న‌టించారు.

సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా పనిచేస్తున్న ఓ అమ్మాయిని కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) ఎలాంటి పరిస్థితులలో ఏ విధంగా కాపాడాడు? ఇదే క్రమంలో ఆ అమ్మాయితో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు? తన ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి  హీరో పెద్ద‌ల‌ను ఎలా ఒప్పిస్తాడనే క‌థ‌తో “నేను మీకు బాగా కావాల్సిన వాడిని“ సినిమా సాగ‌నుంది. 

ల‌వ్, కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంద‌ని ఈ ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. లెజెండరీ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Read More: Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. రిలీజ్ ఎప్పుడంటే

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!