జూలై 8వ తేదీ నుంచి ‘ఆహా’లో (Aha) స్ట్రీమింగ్ కానున్న ‘గుళ్టు’.. ట్రైలర్‌‌తో సినిమాపై ఆసక్తి పెంచేసిన మేకర్స్

Updated on Jul 06, 2022 09:19 PM IST
ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న గుళ్టు సినిమా పోస్టర్లు
ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న గుళ్టు సినిమా పోస్టర్లు

వెరైటీ కథలు, కథాంశాలతో సినిమాలు, షోలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఓటీటీ ‘ఆహా’(Aha) . ఒక పక్క వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిస్తూనే.. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తూ సినీ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది ఆహా. ఈ క్రమంలోనే మరో సినిమాను డబ్‌ చేసి ఆహా వ్యూయర్స్‌ ముందుకు తీసుకురానుంది. కన్నడలో సూపర్‌‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌‌ ‘గుళ్టు’ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. 

కన్నడ నటుడు చిక్కన జనార్ధన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గుళ్టు’ సినిమాను తెలుగులోకి డబ్‌ చేసింది ఆహా. జూలై 8వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేసింది. బుధవారం రిలీజ్ చేసిన ‘గుళ్టు’ సినిమా ట్రైలర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

ఆసక్తి పెంచేలా ట్రైలర్..

‘నేను వేరెవరికీ హీరోను కాను.. నాకు మాత్రమే హీరోని’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తోంది. ఈ ఒక్క డైలాగ్ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్‌ మరింతగా పెంచేస్తోంది. ‘ఆకలి కడుపులకు ఆశలు ఎక్కువ’ అనే డైలాగ్‌తో స్టార్ట్‌ అయిన ట్రైలర్‌‌లో.. వైరస్, సైబర్ క్రైమ్‌, పోలీసుల ఎంక్వైరీ తదితర అంశాల చుట్టూ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. సైబర్ క్రైమ్‌పై ఇప్పటికే పలు సినిమాలు వచ్చినా.. గుళ్టు సినిమా కాన్సెప్ట్‌ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తోంది. మొత్తానికి ‘ఆహా’ (Aha) వేదికగా రిలీజ్‌ కానున్న ‘గుళ్టు’ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి మరి.

Read More : కామెడీ ఇష్టపడే సినీ ప్రేమికులు మిస్ కాకూడని పది టాలీవుడ్‌ (Tollywood) సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!