కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) హీరోగా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”.. మాస్ బీట్ సాంగ్ రిలీజ్..!

Updated on Aug 30, 2022 02:50 PM IST
“నేను మీకు బాగా కావాల్సిన వాడిని” (Nenu Meeku Baga Kavalsinavadini) సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సంజన ఆనంద్ పరిచయమవుతోంది.
“నేను మీకు బాగా కావాల్సిన వాడిని” (Nenu Meeku Baga Kavalsinavadini) సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సంజన ఆనంద్ పరిచయమవుతోంది.

విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram). “రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత 'ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం' లాంటి చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. 

కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్ష‌కుల‌లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. కాగా, ఈ ఏడాది మొద‌ట్లో ‘సెబాస్టియ‌న్‌’తో నిరాశ‌ప‌రిచిన ఇటీవ‌లే విడుద‌లైన ‘స‌మ్మ‌త‌మే’ (Sammathame) చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేశాడు. ఇక తాజాగా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అంటూ డిఫరెంట్ టైటిల్ తో వచ్చేసాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని” (Nenu Meeku Baga Kavalsinavadini) సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సంజన ఆనంద్ పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'అట్టాంటి ఇట్టాంటిదాన్ని కాను మావో' అంటూ ఈ పాట సాగుతోంది. ఇది ఒక దాభాలో సాగే ఐటమ్ సాంగ్. జోరుగా .. హుషారుగా సాగే మాస్ బీట్ ఇది.  

స్వ‌ర మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ (Manisharma) చాలా రోజుల త‌ర్వాత మంచి పెప్పి సాంగ్‌ను కంపోజ్ చేశాడు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్టెప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. కాసర్ల శ్యామ్ ర‌చించిన ఈ పాట‌ను సాకేత్, కీర్త‌న శ‌ర్మ ఆల‌పించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన 'న‌చ్చావ్ అబ్బాయ్‌', 'లాయ‌ర్ పాప' పాట‌లకు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఆఫీషియల్ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

Read More: వింటేజ్ స్టైలిష్ లుక్ లో 'సమ్మతమే' (Sammathame) హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!