అడ‌వి శేష్ 'మేజ‌ర్' (Major) సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించిన విజ‌య‌శాంతి

Updated on Jul 19, 2022 09:54 AM IST
'మేజ‌ర్' (Major) సినిమా గొప్ప‌గా తెర‌కెక్కించారంటూ విజ‌య‌శాంతి ప్ర‌శంసించారు.
'మేజ‌ర్' (Major) సినిమా గొప్ప‌గా తెర‌కెక్కించారంటూ విజ‌య‌శాంతి ప్ర‌శంసించారు.

టాలీవుడ్‌లో మేజ‌ర్ (Major) సినిమా బ్లాక్ బాస్ల‌ర్ హిట్ సాధించింది. ఓటీటీలో 'మేజ‌ర్' చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. హీరోయిన్ విజ‌య‌శాంతి 'మేజ‌ర్' సినిమాపై ట్వీట్ చేశారు. 'మేజ‌ర్' సినిమా గొప్ప‌గా తెర‌కెక్కించారంటూ ప్ర‌శంసించారు. అడ‌వి శేష్, శ‌శికిర‌ణ్ కాంబోలో తెర‌కెక్కిన 'మేజ‌ర్' సినిమాలో సైనికుల బాధ్య‌త‌ల‌ను చూపించార‌న్నారు.

ఒక‌ప్పుడు విజ‌య‌శాంతి సినిమాలంటే హీరోల‌కు పోటీగా తెర‌కెక్కేవి. అంతేకాకుండా హీరోల‌తో పోటీగా పారితోష‌కం కూడా తీసుకునేవార‌ట‌. విజ‌య‌శాంతి న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. మ‌హేష్ బాబు సినిమా 'స‌రిలేరు నీకెవ్వ‌రు'తో విజ‌య‌శాంతి సెకండ్ ఇన్సింగ్స్ స్టాట్ చేశారు.

మేజ‌ర్(Major) గొప్ప సినిమా - విజ‌య‌శాంతి
ఈ మ‌ధ్య తాను చూసిన సినిమా 'మేజ‌ర్' అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. మానవ సంబంధాల విలువల‌ను, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును ఈ చిత్రంలో గొప్ప‌గా చూపించార‌న్నారు.  మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణి, భావోద్వేగాలను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని విజ‌య‌శాంతి తెలిపారు.

అభినంద‌నీయం- విజ‌య‌శాంతి
దేశం పట్ల సైనికులకు ఉండే బాధ్యతను 'మేజ‌ర్' చిత్రంలో చూపించారు. సైన్యంలో చేరే పౌరులకు ఉండే జాతీయభావాల నిస్వార్థపూరిత స్ఫూర్తిని స్పష్టంగా చెప్పగలిగిన చిత్రం 'మేజ‌ర్' అని తెలిపారు. ప్రజా శ్రేయస్సులో అంకితభావంతో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు ఎల్లప్పుడూ అభినందనీయనమేన‌ని విజ‌య‌శాంతి తెలిపారు. ఇలాంటి సినిమాలు సమాజానికి యువతకి ఎంతో అవసరం అంటూ 'మేజ‌ర్' (Major) చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించారు విజ‌య‌శాంతి.

Read More:  'MAJOR' REVIEW (మేజర్ రివ్యూ): దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌ని, వారిని కాపాడ‌టం సోల్జ‌ర్ ప‌ని : అడివి శేష్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!