కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) రిలీజ్ డేట్ ఫిక్స్!

Updated on Oct 30, 2022 10:31 AM IST
తాజాగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్ర విడుదల తేదీని కన్ఫార్మ్ చేసింది చిత్రబృందం.
తాజాగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్ర విడుదల తేదీని కన్ఫార్మ్ చేసింది చిత్రబృందం.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.    

'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వంటి చిత్రాలతో జనాదరణ పొందిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ యంగ్ హీరో వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు కిరణ్. 

అంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ లో (Glimpse) 'ఏడు వింతల గురించి మాకు తెలియదు.. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి'.. 'మాది తిరుపతి.. నా పేరు విష్ణు.. ఇంకొన్ని రోజుల్లో మీరంతా చూడబోయేదే నా కథ' అంటూ హీరో పలికిన డైలాగ్స్ అదరగొట్టాయి. చిత్తూరు యాస‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైలాగులు భలే గమ్మత్తుగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్ర విడుదల తేదీని కన్ఫార్మ్ చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘విలేజ్‌ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైనర్‌ ఇది. కిరణ్‌ అబ్బవరం పాత్ర అలరించే విధంగా ఉంటుంది’ అన్నారు.

Read More: 'వినరో భాగ్యము విష్ణు కథ‌' సినిమా అప్డేట్ .. చిత్తూరు యాస‌లో అదరగొడుతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!