Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. రిలీజ్ ఎప్పుడంటే

Updated on Jul 16, 2022 02:07 PM IST
 కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) పుట్టిన రోజు సంద‌ర్భంగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.
కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) పుట్టిన రోజు సంద‌ర్భంగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

టాలీవుడ్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram)వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ‘స‌మ్మ‌త‌మే’ చిత్రంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హిట్‌ను సాధించారు. ప్ర‌స్తుతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న‌ ‘నేను మీకు బాగా కావాల్సిన‌ వాడిని’ నుంచి క్రేజీ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9 న రిలీజ్ చేయ‌నున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెన్సాన్స్ వ‌చ్చింది.

రిలీజ్ ఎప్పుడంటే..
'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. శ్రీధ‌ర్ గాదె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా సెప్టెంబర్ 9 న రిలీజ్ కానుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రం విడుద‌ల పోస్ట‌ర్‌ను కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా నేను మీకు బాగా కావాల్సిన వాడిని తెర‌కెక్కుతుంది.

ఫుల్ బిజీగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం
కిర‌ణ్ (Kiran Abbavaram) కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. లేజెండ్ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం నాలుగు చిత్రాల‌ను వ‌రుస‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ప్ర‌స్తుతం కిర‌ణ్ ‘మీట‌ర్’, ‘రూల్స్ రంజ‌న్‌’, ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ’ సినిమాల‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటు 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించ‌నున్నారు.

Read More: 'వినరో భాగ్యము విష్ణు కథ‌' సినిమా అప్డేట్ .. చిత్తూరు యాస‌లో అదరగొడుతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!