‘సమ్మతమే’ సినిమా ట్రైలర్ : యూత్‌ను ఆకట్టుకునేందుకు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరో ప్రయత్నం !

Updated on Jun 17, 2022 02:15 PM IST
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి కేటీఆర్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి కేటీఆర్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సమ్మతమే’. జూన్‌ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ‘సమ్మతమే‘ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్ చేసింది.

రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ‘సమ్మతమే‘ సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కిరణ్ అబ్బవరం ఫ్రెష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే ఆయన డైలాగ్ డిక్షన్‌, యాక్టింగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ‘సమ్మతమే‘ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్‌ అవుట్‌ అయినట్టుగా టీజర్‌‌లో కనిపిస్తోంది.

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘సమ్మతమే’ సినిమా పోస్టర్

డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి..

ముఖ్యంగా కిరణ్‌  చెప్తున్న డైలాగులు యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉన్నాయి. ‘గోల్డెన్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్ చాన్స్’ ‘గుద్ది పడదొబ్బడం అంటే ఏంటో అనుకున్నాను.. మరీ ఇలానా.. లారీలు అయినా గుద్దితే తిరిగి చూస్తాయేమో.. ఈ అమ్మాయిలు తిరిగి చూసేలా లేరు’  అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి.

‘సారీ‘ చెప్పగానే.. మరో ‘5 సార్లు‘ చెప్పమంటూ హీరోయిన్ అనేసరికి కిరణ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు.. ‘నీకు నేనే కాదు ఏ అమ్మాయీ కరెక్ట్‌ కాదు.. అద్దంలో నీ మొహం నువ్వే చూసుకుని, తాళి కట్టుకో’ అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి.

డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌నూ చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. కిరణ్‌ (Kiran Abbavaram) తండ్రిగా గోపరాజు రమణ నటన కూడా బాగుంది. ఈ సినిమా టీజర్‌‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌ గురువారం రిలీజ్ చేశారు.

Read More: అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదంటున్న కమల్‌హాసన్ (Kamal Haasan).. రూ. 300 కోట్ల సంపాదనపై కామెంట్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!