Major: 50 రోజులు పూర్తి చేసుకున్న 'మేజ‌ర్'.. అడ‌వి శేష్ (Adivi Sesh) భావోద్వేగ ట్వీట్

Updated on Jul 24, 2022 01:33 PM IST
Major: 'మేజ‌ర్' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) భావోద్వేగ ట్వీట్ చేశారు.
Major: 'మేజ‌ర్' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) భావోద్వేగ ట్వీట్ చేశారు.

Major: టాలీవుడ్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టించిన 'మేజ‌ర్' సినిమా మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ముంబై ఉగ్ర‌దాడుల్లో ప్రాణ‌త్యాగం చేసి ప్ర‌జ‌ల‌ను కాపాడిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కంది. శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'మేజ‌ర్' సినిమా ఓటీటీలోనూ దూసుకెళుతుంది. 'మేజ‌ర్' చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇండియా, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

సందీప్ ఉన్నికృష్ణన్ ఆశీర్వ‌దించారు - అడ‌వి శేష్

'మేజ‌ర్' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) భావోద్వేగ ట్వీట్ చేశారు. 'మేజ‌ర్' సినిమా విడుద‌లై 50 రోజులు పూర్త‌యిందన్నారు శేష్. తాను న‌టించిన అత్యంత విజ‌య‌వంత‌మైన.. అత్యంత అర్థ‌వంత‌మైన చిత్రం 'మేజ‌ర్' అని అడ‌వి శేష్ ట్వీట్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సర్ మమ్మల్ని ఆశీర్వదించారంటూ అడ‌వి శేష్ భావోద్వేగ ట్వీట్ చేశారు. 

Major: 'మేజ‌ర్' చిత్రంలో అడ‌వి శేష్‌ (Adivi Sesh) కు జోడిగా సయి ముంజ్రేకర్ న‌టించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ, శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ అవుతున్న 'మేజ‌ర్' చిత్రం 14 దేశాల్లో ట్రెండింగ్‌‌లో ఉంది. సౌత్ ఏషియా సినిమాలలో టాప్ వ‌న్ ప్లేస్‌లో 'మేజ‌ర్' ట్రెండ్ అవుతోంది. 

మేజ‌ర్ (Major) గొప్ప సినిమా - విజ‌య‌శాంతి

ఈ మ‌ధ్య తాను చూసిన సినిమా 'మేజ‌ర్' అని హీరోయిన్ విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. మానవ సంబంధాల విలువల‌ను, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును ఈ చిత్రంలో గొప్ప‌గా చూపించార‌న్నారు.  మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణి, భావోద్వేగాలను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని విజ‌య‌శాంతి తెలిపారు.

 

మేజ‌ర్ ఓ గొప్ప దేశ‌భ‌క్తి చిత్రం

Major: అడివి శేష్ అమెరికాలో పుట్టారు. అక్క‌డే పెరిగారు. ప్ర‌ముఖ తెలుగు ర‌చ‌యిత అడివి బాపిరాజు మ‌నవడే అడివి శేష్. ఆయనపై తన తాత గారి ప్రేరణ ఎంతో ఉంది. విదేశాలలో ఉన్నప్పుడే, సినిమాల‌పై ఇష్టం పెంచుకున్న అడివి శేష్ హీరో అయ్యేందుకు ఇండియా వ‌చ్చారు. శేష్‌కు దేశ‌భ‌క్తి ఎక్క‌వ‌. అందుకే త‌న సినిమా కథలను కూడా అదే ఇతివృత్తంతో ఎంచుకొనేవారు. మేజ‌ర్ (Major) సినిమాతో శేష్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే గొప్ప దేశ‌భ‌క్తి చిత్రాన్ని తీశారు. 

Read More:  'MAJOR' REVIEW (మేజర్ రివ్యూ): దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌ని, వారిని కాపాడ‌టం సోల్జ‌ర్ ప‌ని : అడివి శేష్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!