Major : 'మేజ‌ర్' మొద‌టి రోజు క‌లెక్ష‌న్ అద‌ర‌హో.. అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న‌ అడ‌వి శేష్ (Adivi Sesh)

Updated on Jun 05, 2022 06:44 PM IST
మేజర్ (Major) సినిమా మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ థియేట‌ర్ల‌లో దూసుకుపోతుంది. ఆడియ‌న్స్ నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. 
మేజర్ (Major) సినిమా మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ థియేట‌ర్ల‌లో దూసుకుపోతుంది. ఆడియ‌న్స్ నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. 

దేశం కోసం మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ చేసిన త్యాగానికి నివాళిగా మేజ‌ర్ (Major) సినిమా తెర‌కెక్కించారు. మేజ‌ర్‌గా అడ‌వి శేష్ (Adivi Sesh) అద్భుతంగా న‌టించారు. ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క డైరెక్ష‌న్‌లో మేజ‌ర్ సినిమా జూన్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 'మేజ‌ర్' సినిమాను నిర్మించారు. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ చేసిన త్యాగాన్ని ప్ర‌తీ భార‌తీయుడికి తెలిసేలా చేయాల‌న్న‌ది చిత్ర యూనిట్ సంక‌ల్పం. అందుకోసం మేజ‌ర్ సినిమా టికెట్ రేట్ల‌ను కూడా త‌గ్గించారు. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌ల్లిదండ్రుల‌కు 'మేజ‌ర్' అంకితం అని ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క చెప్పారు. 

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మేజ‌ర్
అడ‌వి శేష్ హీరోగా గూఢాచారి, ఎవ‌రు సినిమాల్లో చేసిన న‌ట‌న ఒకెత్తైయితే.. మేజ‌ర్‌గా చేసిన యాక్టింగ్ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకుంది. వ‌సూళ్లు పరంగా మేజ‌ర్ చిత్రం ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా దూసుకెళుతుంది.  అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. ఆఫ్ మిలియ‌న్ డాల‌ర్ల‌ను మేజ‌ర్ అగ్ర‌రాజ్యంలో రాబ‌ట్టింది. ఈ చిత్రం రూ. 19 కోట్ల టార్గెట్‌తో థియేట‌ర్ల‌లోకి ఎంట‌ర్ అయింది. సినిమా ప‌రంగానే కాకుండా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ మేజర్  (Major) సినిమా దూసుకుపోతుంది. ఆడియ‌న్స్ నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. 

ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల ఎంతంటే
పాన్ ఇండియా సినిమాగా మేజ‌ర్  (Major) రిలీజ్ అయింది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్ చూస్తే మేజ‌ర్ బానే వ‌సూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. తెలంగాణ‌లో సింగిల్ స్కీన్ రూ.150, మల్టీ ప్లెక్స్ టికెట్ రేటు రూ.195గా డిసైడ్ చేశారు. ఇక‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.147, మల్టీ ప్లెక్స్ అయితే రూ.177 మేజ‌ర్ సినిమా టికెట్ ధ‌ర నిర్ణ‌యించారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మేజ‌ర్ క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతుంది. హిందీలో కాస్త స్లో అనిపించినా.. ముందు ముందు మంచి క‌లెక్ష‌న్ రాబ‌డుతుంద‌నే టాక్ వినిపిస్తుంది. మేజర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధం అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో మేజ‌ర్ రిలీజ్ అయిన‌ 50 రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. 

మేజర్ (Major) మూవీ ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధం అవుతుంది.

మేజ‌ర్ రిలీజ్ రోజు క‌లెక్ష‌న్ 

  • నైజాం - రూ.1.75 కోట్లు
  • సీడెడ్ - రూ.46 లక్షలు
  • ఈస్ట్ - రూ.24 లక్షలు
  • వెస్ట్ - రూ.24 లక్షలు
  • ఉత్త‌రాంధ్ర - రూ.51 లక్షలు
  • గుంటూరు- రూ30 లక్షలు
  • కృష్ణా - రూ.28లక్షలు
  • నెల్లూరు - రూ.19లక్షలు
  • ఇతర రాష్ట్రాల్లో - రూ 0.35కోట్లు
  • ఓవర్సీస్‌- రూ2.35 కోట్లు

మొత్తం- రూ.7.12 కోట్లు(రూ.13.10కోట్ల గ్రాస్‌)

మేజ‌ర్  (Major) చిత్రంలో అడ‌వి శేష్‌కు జోడిగా స‌యీ మంజ్రేకర్ న‌టించారు. శోభిత దూళిపాళ్ల ఓ ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేశారు. ముర‌ళీ శ‌ర్మ త‌న న‌ట విశ్వ‌రూపం చూపారు. త‌న స్టైల్లో ఏ సినిమాకి ఎలా చేయాలో అనేది ప్ర‌కాశ్ రాజ్‌కు బాగా తెలుసు. ప్ర‌కాశ్ రాజ్ డైలాగులు మేజ‌ర్‌లో అద‌రిపోయాయి. రేవ‌తి మేజ‌ర్ త‌ల్లి  పాత్ర‌లో ఒదిగిపోయారు. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ దేశం కోసం పోరాడిన ఘ‌ట‌న‌లు, ప్రాణ త్యాగాన్ని ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క (Sasi Kiran Tikka) ఓ రేంజ్‌లో తెర‌కెక్కించారు. ఇక ముందు ముందు మేజ‌ర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Read More : https://telugu.pinkvilla.com/entertainment/the-third-single-of-the-film-titled-jana-gana-mana-from-the-adivi-sesh-starrer-major-has-been-released-in-all-languages-962

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!