అడివి శేష్ (Adivi Sheh) హీరోగా తెరకెక్కిన ‘హిట్‌-2’ (HIT 2) నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలోనే టీజర్‌ రిలీజ్!

Updated on Oct 23, 2022 12:45 PM IST
అడివి శేష్ (Adivi Sheh) హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్‌-2’ (HIT 2) ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది.
అడివి శేష్ (Adivi Sheh) హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్‌-2’ (HIT 2) ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది.

విశ్వక్ సేన్ (Vishwak sen) హిట్ హీరోగా 2020లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మూవీ 'హిట్ ' (HIT Movie). చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాల్లో 'హిట్' ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. 

దర్శకుడు శైలేష్ కొలను డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌, విజన్‌తో ప్రేక్షకులను సినిమా చివర వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఇక, ఈ చిత్రంతో నిర్మాతగా నాచుల్ స్టారి నానికి (Hero Nani) భారీ హిట్ వచ్చింది. వాల్ పోస్టర్ బ్యానర్ పై డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సిక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

అడివి శేష్ (Adivi Sheh) హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్‌-2’ (HIT 2) ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా హీరో నాని ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించాడు. 'హిట్‌-2' టీజర్‌ త్వరలోనే రానున్నట్లు ట్వీట్‌ చేశాడు.

అడవి శేష్ నటించిన ‘మేజర్’ (Major Movie) చిత్రం పాన్ ఇండియా లెవల్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అడవి శేషు నుండి వస్తున్న 'హిట్ 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అడవిశేష్ ఈ సినిమా రష్ చూశానని తన న్యూ అవతార్ సూపర్ గా ఉందని తెలిపాడు. డైరెక్టర్ సైలేష్‌ కొలనుకు, హీరో నానికు ధన్యవాదాలు తెలియజేశాడు.

'హిట్ 1' ను మించేలా ఈ సినిమాను డైరెక్టర్ మరింత అద్భుతంగా తెరకెక్కించారని.. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్ 2న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాని 'దసరా' (Dasara) మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

Read More: HIT The Second Case : అడ‌వి శేష్  (Adivi Sesh) న‌టిస్తున్న‌ 'హిట్ -  ద సెకెండ్ కేస్' చిత్రం టాప్ 10 విశేషాలు..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!