న‌ర‌మే ఇనుమై... జ్వ‌లితో చెలిచేయ్‌.. అంటూ సాగిన‌ మేజ‌ర్ (Major) 'జన గణ మన' పాట‌

Updated on Jun 02, 2022 12:51 PM IST
మేజ‌ర్ (Major) సినిమా నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న సాంగ్‌ను రిలీజ్ చేశారు.
మేజ‌ర్ (Major) సినిమా నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న సాంగ్‌ను రిలీజ్ చేశారు.

అడ‌వి శేష్ న‌టించిన‌ మేజ‌ర్ (Major) సినిమా కొన్ని గంట‌ల్లో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే మేజ‌ర్ సినిమా ప్రివ్యూ షోల‌తో హిట్ టాక్ తెచ్చుకుంది. మేజ‌ర్ సినిమా నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న పాట‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మేజ‌ర్ పోరాటాన్ని తెలిపే పాట‌గా జ‌న‌గ‌ణ‌మ‌న ఉంది. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడ‌వి శేష్. కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు  వినోదం పంచుతుంటారు.  

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజ‌ర్ (Major) సినిమాను తెర‌కెక్కించారు. ఓ మేజ‌ర్ దేశానికి ఎలాంటి త్యాగాలు చేశారో ప్ర‌తీ భార‌తీయుడికి తెలిసేలా తీశారు. పాన్ ఇండియా సినిమాగా మేజ‌ర్ జూన్ 3న రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ట్రైలర్, పాటలకు విశేష స్పంద‌న వ‌చ్చింది. గూడచారి ఫెమ్ శశికిరణ్ తిక్క మేజ‌ర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

 

మేజ‌ర్ సినిమా నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న సాంగ్‌ను రిలీజ్ చేశారు. జ‌న‌గ‌ణ‌మ‌న సాంగ్‌లో  మేజ‌ర్ యాక్ష‌న్ సీన్స్ చూపించారు. దేశ భ‌క్తి ర‌గిలేలా పాట‌ను రాశారు. న‌ర‌మే ఇనుమై... జ్వ‌లితో చెలిచేయ్‌... అంటూ సాగిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించారు. రాజీవ్ భ‌ర‌ద్వాజ్ మేజ‌ర్ (Major) సినిమా పాట‌ల‌కు లిరిక్స్ రాశారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!