Major: నా కుమారుడు చనిపోలేదు.. అందరి హృదయాల్లో బ్రతికే ఉన్నాడు - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి
Major: మేజర్ సినిమా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోనుంది. 26/11 ముంబై దాడుల్లో ప్రాణ త్యాగం చేసి ప్రజలను కాపాడిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా తెరకెక్కింది. 31 ఏళ్లకే ఆర్మీ ఆఫీసర్‌గా సందీప్ ఉన్నికృష్ణన్ భారతదేశం గర్వించదగ్గ వీరుడిగా నిలిచారు. 14 మందిని ఉగ్రమూకల నుంచి కాపాడుతూ, చావుకు ఎదురెళ్లి మరీ రక్షించారు.
తాజాగా విడుదలైన చిత్రంలో, హీరో అడవి శేష్ (AdiviSesh) మేజర్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇదే క్రమంలో ప్రేక్షకులతో 'సెల్యూట్.. మేజర్' అనిపించుకున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా విడుదల అయింది. హీరో మహేష్ బాబు మేజర్ సినిమాను నిర్మించారు.
మేజర్ సందీప్ అందరికీ ఆదర్శంగా నిలిచారు - కె. ఉన్నికృష్ణన్
హైదరాబాద్‌లో మేజర్ (Major) సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు సినిమా ప్రిప్యూ చూశారు. ఇదే క్రమంలో సందీప్ తండ్రి కె. ఉన్నికృష్ణన్ మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు ఈ లోకంలో లేడనే విషయం తమను ఎప్పటికప్పుడు బాగా కలచివేస్తుందన్నారు. ఆయన పోరాటపటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. 'మేజర్' సినిమాని తెరకెక్కించిన అడివి శేష్‌ను ఈ సందర్భంగా కొనియాడారు. తమ కుమారుడి త్యాగం గురించి ఈ సినిమా ద్వారా.. మళ్లీ లోకానికి పరిచయం తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
'మేజర్' సినిమాను దర్శకుడు శశి అద్భుతంగా తెరకెక్కించారని, విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు, హిందీలలో 'మేజర్' సినిమాను తెరకెక్కించారు. అలాగే మలయాళంలో డబ్బింగ్ చేశారు.
మేజర్ సందీప్ తండ్రి కె.ఉన్నిక్రిష్ణన్ ఈ సందర్భంగా, మేజర్ టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ఈ సినిమా ద్వారా తమ దుఃఖాన్ని మరిచేలా చేశారని ఎమోషనల్ అయ్యారు. "అందరూ నా కొడుకు చనిపోయాడని అంటున్నారు. కానీ ఈ సినిమా చూశాక తను చనిపోలేదని.. అందరి హృదయాల్లో నిలిచే ఉన్నారని అర్థమైందని" కె. ఉన్నికృష్ణన్ అన్నారు.
ఎంతో మందికి ఆదర్శంగా తన కొడుకు నిలిచారన్నారు. హైదరాబాద్‌లో ఇస్రోలో తాను పని చేశానని... సందీప్ ఉన్నికృష్ణన్‌తో ఇక్కడ గడిపిన జ్ఞాపకాలు, తనకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు.
మేజర్ టీమ్ పై ప్రశంసల వెల్లువ
అశోకచక్ర పురస్కార గ్రహీత (Major) మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్, మన దేశం కోసం చేసిన త్యాగాన్ని ప్రతీ భారతీయుడి కళ్లకు కట్టేలా 'మేజర్' సినిమా తీశారని సినీ అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో, అలాగే భావోద్వేగాలతో కూడిన సంభాషణలను చెప్పడంలో అడవి శేష్ (AdiviSesh) మేజర్ పాత్రలో మంచి పరిణితి కనబరిచారు.
అలాగే హీరోయిన్ సయీ మంజ్రేకర్, అడవి శేష్ కాంబో సూపర్ అని ప్రేక్షకులు జడ్జిమెంట్ ఇవ్వడం విశేషం. ఇక శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్లస్ అనేది టాక్. 'మేజర్' లాంటి సినిమాలు జాతీయ భావం పెంచుతాయని.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని అనేకమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Read more : ఆకట్టుకుంటున్న అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?