Nayanthara Weds Vignesh Shivan : న‌య‌న‌తార‌, విఘ్నేష్‌ల క‌ళ్యాణ వైభోగం !

Updated on Jun 09, 2022 10:02 AM IST
 Nayanthara and Vignesh Shivan Wedding :  న‌య‌న‌తార వెడ్స్ విఘ్నేష్ శివ‌న్‌
Nayanthara and Vignesh Shivan Wedding : న‌య‌న‌తార వెడ్స్ విఘ్నేష్ శివ‌న్‌
న‌య‌న‌తార‌, విఘ్నేష్‌ల పెళ్లికి హాజ‌రైన త‌మిళ ద‌ర్శకులు 

 పెళ్లి వేడుక‌లో ద‌ర్శ‌కులు  కేఎస్ శివ‌కుమార్, శివ‌, హ‌రిలు

త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నయ‌న్, విక్కీల పెళ్లికి హాజ‌ర‌య్యారు. ద‌ర్శ‌కులు 
కేఎస్ శివ‌కుమార్, శివ‌, హ‌రిలు పెళ్లి వేడుక‌లో క‌నిపించారు. స‌ర‌దాగా ఫోటోల‌కు ఫోజులిచ్చారు. 

ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా జ‌రిగిన పెళ్లి వేడుక‌

మూడు ముళ్ల‌తో ఒక్క‌టైన న‌య‌న్, విక్కీల జంట‌

ర‌జ‌నీకాంత్ త‌న‌ చేతుల‌తో వ‌రుడు విఘ్నేష్‌కు తాళిని అందించారు. ర‌జ‌నీతో పాటు బంధు మిత్రుల స‌మ‌క్షంలో .. వేద మంత్రాల న‌డుమ.. విఘ్నేష్ శివ‌న్ న‌య‌న‌తార‌కు మూడు ముళ్లు వేశారు. తర్వాత, పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రులుగా వందేళ్ల జీవిత ప్ర‌యాణానికి ఆహ్వానం ప‌లికారు.

పెళ్లికి హాజ‌రైన సూర్య, జ్యోతిక‌, ద‌ళ‌ప‌తి విజ‌య్‌లు

సూర్య త‌న భార్య జ్యోతిక‌తో న‌య‌న‌తార పెళ్లికి హాజ‌ర‌య్యారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా న‌య‌న్, విక్కీల వివాహానికి హాజ‌ర‌య్యారు. అభిమాన హీరోల‌ను చూసి ఫ్యాన్స్  కేరింత‌లు కొట్టారు. పెళ్లి వేడుక‌కు సినీ దిగ్గ‌జాలు రావ‌డంతో, ఆ ప్రదేశమంతా సంద‌డిగా మారింది. 

పెళ్లి భోజ‌నాల్లో స్పెష‌ల్ ప‌న‌స‌కాయ బిర్యానీ

పెళ్లి భోజ‌నాలు సింపుల్ అండ్ టేస్టీగా ఉండేలా ప్లాన్ చేశార‌ట‌

పెళ్లి భోజ‌నాల‌కు కూడా న‌య‌న్, విక్కీ జంట ద‌గ్గ‌రుండి మెనూని ఎంపిక చేశార‌ట‌. ముఖ్యంగా, ప‌న‌స‌కాయ బిర్యానీని ప్రత్యేకంగా చేయించార‌ట‌. వెజ్ వంట‌కాలు, స్వీట్ల‌తో పెళ్లి భోజ‌నాలు సింపుల్‌గా, టేస్టీగా ఉండేలా ప్లాన్ చేశార‌ట‌. అలాగే, చెట్టీనాడ్ నాన్ వెజ్ వంట‌లు కూడా చేయించారు.  అలాగే, బాదాం హ‌ల్వా, పాయ‌సం, ఐస్‌క్రీంను స్పెష‌ల్‌గా ఆర్డ‌ర్ చేశార‌ట‌. 

ర‌జ‌నీకాంత్ రాక‌తో సంద‌డిగా మారిన పెళ్లి మండ‌పం

ర‌జ‌నీకాంత్ రాక‌తో సంద‌డిగా మారిన పెళ్లి మండ‌పం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌య‌న‌తార‌, విఘ్నేష్‌ల పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యారు. త‌లైవా రాక‌తో పెళ్లి మండ‌పంలో హుషారు నెల‌కొంది. ర‌జినీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ ప‌డ్డారు. న‌య‌న్, విక్కీల జంట‌ను ర‌జ‌నీకాంత్ ఆశీర్వ‌దించారు. 
 

సేవా కార్య‌క్ర‌మాల‌తో హృద‌యాల‌ను గెలుచుకున్నారు

ల‌క్ష‌ల మందికి అన్న‌దానం చేస్తున్న కొత్త జంట‌

న‌య‌న‌తార‌, విఘ్నేష్‌లు సేవా గుణంతో మంచి మ‌న‌సును చాటుకున్నారు. త‌మ పెళ్లి రోజునాడు, 18 వేల మంది పేద పిల్లలకు, చిన్నారుల‌కు భోజ‌నం అందించారు. అలాగే త‌మిళ‌నాడులోని ల‌క్ష మంది నిరుపేద‌ల‌కు భోజ‌నం సమకూర్చారు. ఆ విధంగా. వీరు తమ మంచి మ‌న‌సుతో ఎంతో మంది హృద‌యాల‌ను గెలుచుకున్నారు. 

అతిథుల రాక‌తో క‌ళ‌క‌ళలాడుతున్న పెళ్లి మండ‌పం

విక్కీ, న‌య‌న్ పెళ్లికి హాజ‌ర‌వుతున్న సినీ ప్ర‌ముఖులు

విక్కీ, న‌య‌న్ పెళ్లికి హాజ‌ర‌వుతున్న సినీ ప్ర‌ముఖులు

విక్కీ, న‌య‌న్ పెళ్లికి హాజ‌ర‌వుతున్న సినీ ప్ర‌ముఖులు

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు న‌య‌న‌తార వివాహానికి హాజ‌ర‌వుతున్నారు. బాలీవుడ్ నిర్మాత‌, శ్రీదేవి భ‌ర్త బోనీక‌పూర్, కార్తి, వ‌సంత్ ర‌వి వీరి పెళ్లి వేడుక‌కు విచ్చేశారు. అతిథులు కారులో వెళ్తున్న ఫోటోల‌ను, పింక్ విల్లా మీ కోసం క్లిక్ చేసింది. 
 

న‌యన్ క‌ళ్యాణ వేడుక‌కు హాజ‌రైన షారుఖ్ ఖాన్

న‌య‌న‌తార పెళ్లి వేడుక‌లో షారుఖ్ ఖాన్

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార పెళ్లికి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హాజ‌ర‌య్యారు.  స్టైలిష్ లుక్‌లో షారుఖ్ సందడి చేశారు.  న‌య‌న‌తార పెళ్లి వేడుక‌కి షారుఖ్ హాజరైన చిత్రం.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

న‌య‌న్, విక్కీల ప్రేమ‌ను తెలిపేలా పెళ్లి వేడుక‌

 రౌడీ పిక్స‌ర్చ్ అంటూ ఓ టైటిల్ కూడా ఇచ్చారు

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివన్ ప్రేమ‌ను తెలిపేలా ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు ప్లాన్ చేశారు. న‌య‌న్, విక్కీల ఫోటోల‌తో పెళ్లి వేడుక‌ను జ‌రుపుతున్నారు. వాట‌ర్ బాటిల్‌, ప్లేట్స్‌.. ఇలా ప్ర‌తీ వ‌స్తువుపై ఈ జంట ఫోటోల‌ను ప్రింట్ చేశారు. రౌడీ పిక్స‌ర్చ్ అంటూ ఓ టైటిల్ కూడా ఇచ్చారు. అలాగే, విక్కీన‌య‌న్ అనే హ్యాష్ టాగ్‌తో అప్‌డేట్స్ రిలీజ్ చేయ‌నున్నారు. 

#WikkiNayan హ్యాష్ టాగ్‌తో పెళ్లి అప్‌డేట్స్‌

#WikkiNayan హ్యాష్ టాగ్‌తో పెళ్లి అప్‌డేట్స్‌

న‌య‌న‌తార, విఘ్నేష్‌ల పెళ్లి వేడుక‌ల‌పై సోష‌ల్ మీడియా అప్ డేట్స్ అభిమానుల‌కు ఆనందాన్ని పంచుతున్నాయి. న‌య‌న్ ప్ల‌స్ విఘ్నేష్ అంటూ పెళ్లికి వ‌చ్చే అతిధుల కోసం, ప్ర‌త్యేక ఆహ్వానాలతో కూడిన ఫ్లెక్సీలతో అద‌ర‌గొట్టారు. ఆ వెల్ క‌మ్ ఫ్లెక్సీలో విక్కీన‌య‌న్ అనే హ్యాష్ టాగ్ కూడా ఉంది. అలాగే వీరి పెళ్లి అప్‌డేట్స్, ఆ హ్యాష్ టాగ్‌తోనే సోషల్ మీడియాలో వైరల్ కానున్నాయి.

సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్న విఘ్నేష్

ప్ర‌పంచానికి ప్రేమ అవ‌స‌రం ఎంతో ఉంది : విఘ్నేష్

ప్ర‌పంచానికి ప్రేమ అవ‌స‌రం ఎంతో ఉంది :  విఘ్నేష్

న‌య‌న‌తార‌ను పెళ్లి చేసుకొనే క్రమంలో, తన భావాలను విఘ్నేష్ బ‌య‌ట‌పెట్టారు. త‌న ఆనందాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టా వేదికగా తెలిపారు. ఎవరి జీవితమైనా ఆనందంగా ఉండాలంటే, అంతులేని ప్రేమ‌ను పంచాలంటూ క‌విత్వం కూడా చెప్పారు.

అంతేకాదు.. 'ఎదుటివారిని సంతోష పెట్టే ప‌వ‌ర్ ఉంటే.. సంతోష పెట్టండి. ఈ ప్ర‌పంచానికి ఆ అవ‌స‌రం చాలా ఉందంటూ' త‌న భావాలను షేర్ చేసుకున్నారు. 

పెళ్లి ప‌త్రిక‌ల‌ను స్వ‌యంగా పంచిన న‌య‌న్, విక్కీలు

Nayanthara: త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను న‌య‌న‌తార‌, విఘ్నేష్‌లు త‌మ వివాహానికి ఆహ్వానించారు

తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆహ్వానం

నయ‌న్, విఘ్నేష్‌లు పలువురు వీఐపీలను సైతం తమ వివాహానికి ఆహ్వానించారు. ఇప్పటికే కొంత‌మంది అతిథులకు డిజిటల్‌ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌ని కూడా పంపారు. ముఖ్యంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను న‌య‌న‌తార‌, విఘ్నేష్‌లు కలిసి, త‌మ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

సీఎం స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి  ప్రముఖ తమిళ నటుడు. నయనతారతో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించారు. అలాగే పలు చిత్రాల‌ను కూడా నిర్మించారు. ప్ర‌స్తుతం ఉద‌య‌నిధి శాసనసభ్యునిగా సేవలందిస్తున్నారు.  న‌య‌న‌తార  (Nayanthara) త‌న పెళ్లికి ఉద‌య‌నిధితో పాటు, ఆయన తండ్రి సీఎం స్టాలిన్‌కు కూడా  ప్ర‌త్యేక ఆహ్వానం అందించారు. 
 

 Nayanthara: న‌య‌న్‌, విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం ప్ర‌త్యేకం