Nayanthara Wedding : నయన్‌తో కలిసి సెల్ఫీలు దిగిన విఘ్నేష్ .. ప్రపంచానికి ప్రేమ అవసరమన్న విక్కీ !
నయనతార (Nayanathara), విఘ్నేష్‌ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. మూడు ముళ్లతో ఒకటయ్యే క్షణాల కోసం నయన్, విఘ్నేష్‌లు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆకాశమంత పెళ్లి పందిరిలో. బంధుమిత్రుల మధ్య అగ్ని సాక్షిగా విఘ్నేష్, నయన్ మెడలో మూడు ముళ్లు వేసే తరుణం ఆసన్నమైంది.
విఘ్నేష్ శివన్, నయనతారతో పెళ్లికి కొన్ని గంటల ముందే, తన ఇన్‌స్టాలో ఫోటోలను షేర్ చేశారు. నయన్‌తో కలిసి సెల్ఫీలను దిగారు. ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు.
ప్రపంచానికి ప్రేమ కావాలి : విఘ్నేష్
నయనతారతో వివాహానికి సంబంధించి తన ఫీలింగ్‌ను విఘ్నేష్ బయటపెట్టారు. తన ఆనందాన్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకున్నారు. జీవితం ఆనందంగా ఉండాలంటే, అంతులేని ప్రేమను పంచాలంటూ కవిత్వం కూడా రాశారు. అంతేకాదు.. "ఎదుటివారిని సంతోష పెట్టే పవర్ ఉంటే.. సంతోషపెట్టండి. ఈ ప్రపంచానికి అలాంటి అవసరం చాలా ఉందంటూ" తన భావాలను షేర్ చేసుకున్నారు.
కొత్త జంటగా మీడియా ముందుకు
నయనతార (Nayanathara), విఘ్నేష్‌ల పెళ్లి జూన్ 9న.. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు జరగనుంది. పెళ్లికి సాంప్రదాయ దుస్తుల్లో రావాలంటూ వివాహ ఆహ్వాన పత్రికలో తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో నయన్, విక్కీల వివాహం జరగనుంది. వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు.
వివాహ రిసెప్షన్‌కు మాత్రం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారట. జూన్ 10న నయన్, విఘ్నేష్‌ల రిసెప్షన్ జరగనుంది. జూన్ 11న వీరు నవ దంపతులుగా మీడియా ముందుకు రానున్నారు.
Read More: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన నయన్, విఘ్నేష్‌ల జంట