The Warrior Success Meet: 'ది వారియర్' సక్సెస్ మీట్ లో హీరో రామ్ (Ram Pothineni) ఆసక్తికర వ్యాఖ్యలు..!

Published on Jul 17, 2022 02:15 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన తాజా సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు.

జులై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన ఈ సూపర్ సక్సెస్ ఫుల్ మూవీని పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. 

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిత్ర బృందం సక్సెస్ మీట్ (The Warrior Success Meet) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రబందం సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో రామ్.. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు ఇబ్బంది పెడుతున్నా, ప్రజలు థియేటర్లకు వచ్చి తన చిత్రాన్ని ఆదరించినందుకు థ్యాంక్స్ చెప్పాడు. లింగు స్వామితో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని, కృతి శెట్టి (Krithi Shetty), ఆది పినిశెట్టి, ప్రాణం పెట్టి సినిమా చేశారని ప్రశంసలు కురిపించాడు.

'ది వారియర్' సినిమా దర్శకుడు లింగుస్వామి (Director Lingusamy) మాట్లాడుతూ.. ''నాకు చాలా సంతోషంగా ఉంది. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో.. శ్రీనివాస చిట్టూరి లాంటి నిర్మాత.. కృతి శెట్టి లాంటి హీరోయిన్.. ఆది పినిశెట్టి లాంటి మంచి నటుడు.. మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. ఇప్పటివరకు నేను తీసిన 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో.. అలా ఈ సినిమాకు కూడా పెద్ద ఆదరణ లభించింది. ఈ సినిమా విజయం ఇచ్చిన ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. మీ ప్రేమకు థాంక్స్'' అని అన్నారు.
 

Read More: 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన హీరో రామ్ (Ram Pothineni)..!