మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమా 'ఎస్ఎస్ఎంబి 29'పై రాజ‌మౌళి క్లారిటీ !

Updated on Sep 13, 2022 08:40 PM IST
తాజాగా రాజ‌మౌళి మహేష్ బాబు (Mahesh Babu)  సినిమా 'ఎస్ఎస్ఎంబి 29' పై పలు కామెంట్స్ చేశారు. అవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 
తాజాగా రాజ‌మౌళి మహేష్ బాబు (Mahesh Babu) సినిమా 'ఎస్ఎస్ఎంబి 29' పై పలు కామెంట్స్ చేశారు. అవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) 29వ సినిమా జక్కన్న ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ బాబు మొద‌టిసారి ఈ  పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నారు. మహేష్, రాజ‌మౌళి కాంబినేష‌న్ సినిమాపై అభిమానులలో భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాకు 'ఎస్ఎస్ఎంబి 29' అనే టెంప‌ర‌రీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా రాజ‌మౌళి 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాపై చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

రాజ‌మౌళి ఏమ‌న్నారంటే..

'టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్' వేడుక‌ల‌కు రాజ‌మౌళి (SS Rajamouli) హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌ల్లో పాల్గొన్న రాజ‌మౌళి 'ఎస్ఎస్ఎంబి 29' విశేషాల‌ను షేర్ చేసుకున్నారు. ప్ర‌పంచ స్థాయిలో ఓ యాక్ష‌న్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను మ‌హేష్ బాబుతో తెరకెక్కిస్తున్నానని రాజ‌మౌళి తెలిపారు. ఈ సినిమాను రూ. 300 నుంచి రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. నిర్మాత కెఎల్ నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

మ‌హేష్, రాజ‌మౌళి కాంబో అదుర్స్

'ఆర్.ఆర్.ఆర్'తో రాజ‌మౌళి తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. అలాగే, ప్రస్తుతం మ‌హేష్ త‌న 29 వ సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయనున్నారు. 'ఎస్ఎస్ఎంబి 29'  సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ వ‌ర్క్ పకడ్బందీగా జ‌రుగుతోందని స‌మాచారం. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అలాగే రాజ‌మౌళి సోద‌రుడు కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు.

Read More: సూపర్ స్టార్ మహేష్ బాబు 'SSMB 28' షూటింగ్ షురూ.. త్రివిక్రమ్ సినిమాలో అదిరిపోయే లుక్‌తో ప్రిన్స్.. ఫొటో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!