Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాకి.. చిరంజీవికి కనెక్షన్ ఏమిటి ?

Updated on Jun 13, 2022 03:54 PM IST
బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) మొదటి భాగం చిత్రం గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ.
బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) మొదటి భాగం చిత్రం గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ.

బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) మొదటి భాగం చిత్రం గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన, ఈ భారీ వీఎఫ్‌ఎక్స్ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా.. వీరిరువురూ జంటగా నటించారు. 

ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఇటీవలే రణ్‌బీర్ కపూర్, రాజమౌళితో కలిసి.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నం వచ్చారు.

ఇక ఇదే సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ 'బ్రహాస్త్ర' (Brahmastra) చిత్రానికి సంబంధించి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట. 

చిరంజీవి పవర్‌ఫుల్ వాయిస్‌కి ఫ్యాన్స్ ఫిదా 

అవును నిజమే.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ చిత్రానికి తన గాత్రాన్ని అందించారు. ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ దర్శకధీరుడు రాజమౌళి ఓ యూట్యూబ్ వీడియోని విడుదల చేశారు.  పౌరాణిక పాత్రలతో కూడిన యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా 'బ్రహ్మాస్త్ర' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

 

బ్రహ్మాస్త్ర పై భారీ అంచనాలు

అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే షారుఖ్ ఖాన్ కూడా ఒక చిన్న పాత్రలో నటిస్తారని ఆ మధ్య ఓ టాక్ వచ్చింది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ & స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందివ్వడం విశేషం. హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళ భాషలలో సెప్టెంబర్ 9, 2022 తేదిన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

Read More : విక్ర‌మ్ టీమ్‌కు పార్టీ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) ! మ‌రి స‌ల్మాన్ ఖ‌న్ (Salman Khan) ఎందుకెళ్లారు?

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!