కృష్ణంరాజు ( Krishnam Raju) పార్థీవ దేహానికి నివాళి అర్పించిన చిరు, మ‌హేష్!.. ప్ర‌భాస్‌ను ఓదార్చిన సినీ ప్ర‌ముఖులు

Updated on Sep 11, 2022 01:48 PM IST
ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కృష్ణంరాజు (Krishnam Raju) మృత దేహానికి నివాళులు అర్పించారు. 
ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కృష్ణంరాజు (Krishnam Raju) మృత దేహానికి నివాళులు అర్పించారు. 

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టులు, నిర్మాత రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో క‌న్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణం రాజు దాదాపు 187 చిత్రాలలో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచారు. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో రెబ‌ల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు.

ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కృష్ణంరాజు (Krishnam Raju) మృత దేహానికి నివాళులు అర్పించారు. 

కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన సినీ ప్ర‌ముఖులు
కృష్ణంరాజు  (Krishnam Raju) పార్థీవ దేహాన్ని ఆస్ప‌త్రి నుంచి ఆయ‌న నివాసానికి తీసుకెళ్లారు. ప్ర‌భాస్ త‌న పెద్ద‌నాన్న మృత‌దేహాన్ని చూసి భావోద్వేగం చెందారు. ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కృష్ణంరాజు మృత దేహానికి నివాళులు అర్పించారు. 

టాలీవుడ్ న‌టులు చిరంజీవి, వెంక‌టేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబుతో పాటు ప‌లువురు హీరోలు కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు మృత దేహానికి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు మ‌ర‌ణం సినీ రంగానికి తీర‌ని లోట‌న్నారు. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు చ‌నిపోయార‌నే వార్త తెలియ‌డంతో ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులతో పాటు అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

రేపు కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు
కృష్ణంరాజు (Krishnam Raju) సెప్టెంబ‌ర్ 11 తెల్లవారుఝామున 3.16 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కృష్ణంరాజు పార్థివదేహాన్ని సెప్టెంబ‌ర్ 11 మ‌ధ్యాహ్నం 12 గంటలకు ఆయ‌న నివాసానికి తీసుకొస్తారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. అలాగే రేపు ఉద‌యం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఫిలిమ్ ఛాంబ‌ర్‌కు తరలించనున్నారు. ఆ త‌రువాత‌ అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Read More: కృష్ణంరాజు (Krishnam Raju) ను చివ‌రి సారి వెంటిలేటర్‌పై చూసిన ప్ర‌భాస్ (Prabhas)!.. రేపు మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!