Liger: చిల్ అవుతున్న 'లైగ‌ర్' హీరో, ప్రొడ్యూస‌ర్!.. సంతోషంగా క‌నిపించిన‌ విజ‌య్ (Vijay Deverakonda), ఛార్మీలు

Updated on Jul 26, 2022 04:29 PM IST
'లైగ‌ర్' ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత విజ‌య్ (Vijay Deverakonda) తో క‌లిసి ఛార్మి చిల్ అవుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
'లైగ‌ర్' ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత విజ‌య్ (Vijay Deverakonda) తో క‌లిసి ఛార్మి చిల్ అవుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) 'లైగ‌ర్' సినిమాతో ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను బ్రేక్ చేయాల‌ని చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'లైగ‌ర్' సినిమా ట్రైల‌ర్ ఓ వండ‌ర్ క్రియేట్ చేసింది. 'లైగ‌ర్' చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌రుగా వ్య‌వ‌హ‌రిస్తున్న  ఛార్మి హీరో విజ‌య్‌తో దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ప్రొడ్యూస‌ర్‌తో చిల్ అవుతున్న విజ‌య్

'లైగ‌ర్' చిత్రానికి ఛార్మి కౌర్ కూడా ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 'లైగ‌ర్' ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda) తో క‌లిసి ఛార్మి చిల్ అవుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ముంబైలోని ఓ విలాస‌వంత‌మైన రెస్టారెంట్‌లో విజ‌య్, ఛార్మి డ్రింక్ గ్లాసుల‌తో ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు. 'లైగ‌ర్' సినిమా ట్రైల‌ర్ స‌క్సెస్ పార్టీని, వీరితో పాటు చిత్ర యూనిట్ క‌లిసి ఎంజాయ్ చేస్తున్నారు

 

అన్ని సినిమాలు ఒకేసారి చేయ‌లేను : విజ‌య్

'ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని' విజ‌య్ దేవ‌ర‌కొండ అంటున్నారు. 'ఒక సినిమా చేస్తున్న‌ప్పుడు, మ‌రో సినిమాలో కూడా న‌టించ‌డం త‌న వ‌ల్ల' కాదంటున్నారు. తాను మల్టీ టాస్కింగ్ మ్యానేజ్ చేయ‌లేన‌ని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. త‌న ఫోక‌స్ ఎప్పుడూ తాను ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమాపైనే ఉంటుంద‌ని చెప్పారు. 'లైగ‌ర్' పైనే త‌న దృష్టంతా అని చెప్ప‌క‌నే చెప్పారు విజ‌య్.

రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More : 'లైగ‌ర్' కోసం న‌త్తిగా మాట్లాడ‌టం నేర్చుకున్నా.. కామెడీ కూడా : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!