Liger: గుజ‌రాతీ వంటకాలకు 'ఫిదా' అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండే !

Updated on Aug 11, 2022 01:12 PM IST
Liger: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల కోసం గుజ‌రాత్ రాష్ట్రానికి వెళ్లారు.
Liger: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల కోసం గుజ‌రాత్ రాష్ట్రానికి వెళ్లారు.

Liger: టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. లైగ‌ర్ మేక‌ర్స్ కూడా ప్ర‌మోష‌న్ల జోరును కొన‌సాగిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించిన విజ‌య్, అన‌న్య‌ల‌తో ప‌లు న‌గ‌రాల్లో ప్ర‌మోష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

లోక‌ల్ ట్రైన్, టీ స్టాల్స్, కాఫీ షాపులు, రెస్టారెంట్లు.. ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విజ‌య్, అనన్యలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌ను కొత్త‌గా నిర్వ‌హిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. 

గుజ‌రాత్ థాలి సూప‌ర్ - విజ‌య్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్ల కోసం గుజ‌రాత్ రాష్ట్రానికి వెళ్లారు. అహ్మదాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో గుజ‌రాతీ థాలిని ఆర్ట‌ర్ చేశారు. ప‌లు వంట‌కాల‌తో కూడిన గుజ‌రాత్ థాలి ప్లేట్ ముందు ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

డోక్లా, ప‌రాటా, పూరీ, కిచిడి, గుజ‌రాతీ దాల్, గుజ‌రాతీ స్పెష‌ల్ వంకాయ కూర‌తో పాటు.. బాసుందీ, శ్రీఖండ్ వంటి స్వీట్ల‌తో విజ‌య్, అనన్యలు విందు భోజ‌నం చేశారు. 

'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Liger: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల కోసం గుజ‌రాత్ రాష్ట్రానికి వెళ్లారు.

విజ‌య్ కోసం క్యూ క‌డుతున్న యువ‌త‌

లైగ‌ర్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌లు ప‌లు న‌గ‌రాల‌కు వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్, ముంబై, పూణేలో లైగ‌ర్ ప్ర‌మోష‌న్ల‌కు యువ‌త పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. లైగ‌ర్ ప్ర‌మోష‌న్ల కోసం విజ‌య్, అన‌న్య‌లు వ‌రంగ‌ల్ వెళ్ల‌నున్నారు. వ‌రంగ‌ల్‌తో పాటు ప‌లు న‌గ‌రాల్లో ఈ సినిమా ప్ర‌మోష‌న్లు జ‌ర‌గ‌నున్నాయి.

Read More: అనన్యతో కాఫీకి వెళ్లిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్లలో యువ‌త హంగామా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!