అనన్యతో కాఫీకి వెళ్లిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్లలో యువ‌త హంగామా!

Updated on Aug 10, 2022 07:21 PM IST
 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోషన్లు ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి. అన‌న్య‌తో క‌లిసి ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో విజ‌య్  (Vijay Deverakonda)  సంద‌డి చేశారు.
'లైగ‌ర్' సినిమా ప్ర‌మోషన్లు ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి. అన‌న్య‌తో క‌లిసి ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో విజ‌య్  (Vijay Deverakonda) సంద‌డి చేశారు.

Liger: టాలీవుడ్ హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన‌ పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌మోషన్లు ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి. మెన్న‌ ముంబై లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నిన్న టీ స్టాల్‌లో సంద‌డి చేశారు. నేడు అన‌న్య‌తో క‌లిసి ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో విజ‌య్ సంద‌డి చేశారు. ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు వ‌చ్చేలా 'లైగ‌ర్' మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

కొత్త కొత్త ఐడియాల‌తో లైగ‌ర్ ప్ర‌మోష‌న్లు

'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా 'లైగ‌ర్' చిత్ర ప్రమోష‌న్ల‌లో భాగంగా ముంబై మెట్రో రైలులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు ప్ర‌యాణించి సంద‌డి చేశారు. అంతేకాకుండా ముంబైలో చిరంజీవి సినిమా 'గాడ్‌ఫాద‌ర్' షూటింగ్ లొకేష‌న్‌కు చిత్ర యూనిట్ వెళ్లింది. చిరంజీవి, స‌ల్మాన్‌ల‌ను క‌లిసి 'లైగ‌ర్' సినిమా ప్రీమియ‌ర్ షోకు రావాల‌ని కోరింది. 

విజ‌య్ కోసం క్యూ క‌డుతున్న యువ‌త‌

'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య‌లు ప‌లు న‌గ‌రాల‌కు వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్, ముంబై, పూణేలో లైగ‌ర్ ప్ర‌మోష‌న్ల‌కు యువ‌త పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల కోసం విజ‌య్, అన‌న్య‌లు వ‌రంగ‌ల్ వెళ్ల‌నున్నారు. వ‌రంగ‌ల్‌తో పాటు ప‌లు న‌గ‌రాల్లో ఈ సినిమా ప్ర‌మోష‌న్లు జ‌ర‌గ‌నున్నాయి.

Read More: Liger: ముంబైలో మెట్రో రైలు ఎక్కిన 'లైగ‌ర్' జోడి!.. డాన్సులేసిన విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!