Liger: 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో యువ‌త జోరు!.. పూణేలో సంద‌డి చేసిన విజ‌య్ (Vijay Deverakonda), అన‌న్య‌లు

Updated on Aug 12, 2022 04:05 PM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda) ను చూసిన యువ‌తీ యువ‌కులు మాల్ హోరెత్తేలా కేరింత‌లు కొట్టారు.
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda) ను చూసిన యువ‌తీ యువ‌కులు మాల్ హోరెత్తేలా కేరింత‌లు కొట్టారు.

Liger: టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్ల జోరు కొన‌సాగుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా హీరో హీరోయిన్లు విజ‌య్, అన‌న్య‌లు ప‌లు న‌గ‌రాల‌లో సంద‌డి చేస్తున్నారు. పూణేలోని ఓ మాల్‌కు విజ‌య్, అన‌న్య‌లు వెళ్లారు. అక్క‌డి యువ‌త రౌడీ హీరోను చూసి రెచ్చిపోయారు. తమ అభిమాన హీరో విజ‌య్‌ను చూస్తూ కేరింత‌లు కొట్టారు.

విజ‌య్ కోసం క్యూ క‌ట్టిన ఫ్యాన్స్
మ‌హారాష్ట్ర‌లోని పూణేలో లైగ‌ర్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో విజ‌య్, అన‌న్య‌లు సంద‌డి చేశారు. యువ‌త పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ను చూసిన యువ‌తీయువ‌కులు మాల్ హోరెత్తేలా కేరింత‌లు కొట్టారు. నార్త్ ఇండియాలో లైగ‌ర్ సినిమా హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ ప‌లు ఈవెంట్‌లు నిర్వ‌హిస్తున్నారు. లోక‌ల్ ట్రైన్, టీ స్టాల్స్, కాఫీ షాపులు, రెస్టారెంట్లు.. ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విజ‌య్, అనన్యలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ.. అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇస్తున్నారు.

Liger: 'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read More: Liger: గుజ‌రాతీ వంటకాలకు 'ఫిదా' అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!