Godse Movie On OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు స‌త్య‌దేవ్ (Satyadev) గాడ్సే రెడీ

Updated on Jul 14, 2022 11:07 AM IST
నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17 నుంచి స‌త్య‌దేవ్ (Satyadev) గాడ్సే స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17 నుంచి స‌త్య‌దేవ్ (Satyadev) గాడ్సే స్ట్రీమింగ్ కానుంది.

Godse Movie On OTT: టాలీవుడ్‌లో స‌త్య‌దేవ్ (Satyadev) న‌టించిన గాడ్సే చిత్రం ప్రేక్ష‌కుల మెప్పు పొందింది. టాలెంట్‌తో క్యారెక్ట‌ర్ ఆరిస్టు నుంచి హీరోగా మారారు స‌త్య‌దేవ్. ఇటీవ‌ల విడుద‌లైన గాడ్సే చిత్రం స‌త్య‌దేవ్‌కు ఫ్లాప్ తెచ్చిపెట్టింది. గోపి గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వంలో జూన్ 17న గాడ్సే రిలీజ్ అయింది. ఈ చిత్రం ఓటీటీ విడుద‌లకు సిద్ధ‌మైంది.

ఓటీటీ రిలీజ్
గాడ్సే ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17 నుంచి గాడ్సే స్ట్రీమింగ్ కానుంది. గాడ్సే సినిమా రిలీజ్ అయిన నెల రోజుల‌కు ఓటీటీలో విడుద‌ల కానుంది. 'గాడ్సే' సినిమా డిజిట‌ల్ హ‌క్కులు రూ.5 కోట్ల‌కు అమ్ముడవడంతో మేక‌ర్స్ కూడా సంతోష‌ప‌డుతున్నారు. అలాగే హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌కు రూ.2.20 కోట్లను చెల్లించారు.

సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. సీనియ‌ర్ న‌టుడు నాగ‌బాబు, తనికెళ్ల భరణి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

క‌థ ఏంటంటే..
Godse Movie On OTT: గాడ్సే (సత్యదేవ్) (Satyadev) వరుసగా రాష్ట్రానికి సంబంధించిన కొంత మంది రాజ‌కీయ‌నేత‌ల‌ను, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బిగ్‌షాట్స్‌ను కిడ్నాప్ చేస్తాడు. గాడ్సేతో, క్రిమినల్స్‌తో సంప్రదింపులు జరపడానికి పోలీస్ ఆఫీసర్  వెశాలీ (ఐశ్యర్య లక్ష్మీ)ని నియమిస్తారు. ఆనాటి గాడ్సే మహాత్ముడిని చంపితే.. ఈ గాడ్సే  మహాత్ముల ముసుగువేసుకున్న క్రిమిన‌ల్స్‌ను చంపండం సినిమా క‌థాంశం.

స‌త్య‌దేవ్ (Satyadev) న‌టించిన మ‌రో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. హిందీలో అక్ష‌య్ కుమార్ ‘రామ్‌సేతు’లో స‌త్య‌దేవ్ కీలకపాత్రలో న‌టిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ‘గాడ్‌ఫాద‌ర్‌’లోనూ ఈ హీరో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Read More: Godse (గాడ్సే) : సత్యదేవ్ (Satyadev) సినిమా డిజిట‌ల్ రైట్స్‌కి అంత డిమాండా ! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!