Godse (గాడ్సే) : సత్యదేవ్ (Satyadev) సినిమా డిజిట‌ల్ రైట్స్‌కి అంత డిమాండా !  

Updated on Jun 11, 2022 12:40 PM IST
గాడ్సే (Godse)  సినిమా డిజిట‌ల్ హ‌క్కులు రూ.5 కోట్ల‌కు అమ్మ‌డ‌వ‌డంతో మేక‌ర్స్ సంతోష‌ప‌డుతున్నారు.
గాడ్సే (Godse) సినిమా డిజిట‌ల్ హ‌క్కులు రూ.5 కోట్ల‌కు అమ్మ‌డ‌వ‌డంతో మేక‌ర్స్ సంతోష‌ప‌డుతున్నారు.

సత్యదేవ్ (Satyadev)..  టాలీవుడ్ యువ నటుడు. విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. జ్యోతిలక్ష్మి, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బ్లఫ్ మాస్టర్, 47 డేస్, తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవలే చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రంలో కూడా.. రామ్ చరణ్ తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సత్యదేవ్ హీరోగానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సుపరిచితుడు. నవాబ్, సాహో లాంటి సినిమాలలోని పాత్రలకు ఆయన డబ్బింగ్ చెప్పాడు. అలాగే గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. ప్రస్తుతం ఈయన నటించిన తెలుగు చిత్రం 'గాడ్సే' (Godse) చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. 

సత్యదేవ్ 'గాడ్సే' చిత్రంలో హీరోయిన్‌గా కేరళ భామ

స‌త్య‌దేవ్ (Satya Dev) విభిన్న పాత్ర‌లో న‌టించిన సినిమా 'గాడ్సే' (Godse). గోపీ గ‌ణేశ్ ప‌ట్టాభి ఈ  'గాడ్సే' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గాడ్సే ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

గాడ్సే సినిమాలో కేర‌ళ భామ‌ ఐశ్వ‌ర్యలక్ష్మి ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల కొనుగోలుకు భారీ మొత్తాన్నే చెల్లించారట. అలాగే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కూడా మంచి మొత్తానికే అమ్ముడుపోయాయట. 

 

 

ఆసక్తి రేకెత్తిస్తున్న సత్యదేవ్ 'గాడ్సే' సినిమా ట్రైలర్

నేటి సమాజానికి అద్దం పట్టే సినిమా గాడ్సే  (Godse) అని ఈ చిత్ర దర్శకుడు తెలిపారు. 'అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి, పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌లో ఉండాలి, మర్యాద ఉన్నోడే మేయర్‌ కావాలి, సబ్జెక్ట్‌ ఉన్నోడే సర్పంచ్‌ కావాలి ' అనే డైలాగుల‌తో ఈ సినిమా ట్రైల‌ర్ కేక పుట్టిస్తోంది.

నేటి యువతరానికి ఓ సందేశాన్ని అందించే విధంగా,  ఈ సినిమాను తెర‌కెక్కించారు. 'గాడ్సే' సినిమా డిజిట‌ల్ హ‌క్కులు రూ.5 కోట్ల‌కు అమ్ముడవంతో మేక‌ర్స్ కూడా సంతోష‌ప‌డుతున్నారు. అలాగే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూ.2.20 కోట్లకు అమ్మ‌ే అవకాశం ఉందని టాక్.

గాడ్సే (Godse) చిత్రాన్ని సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై  ప్రముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కాశ్య‌ప్, సాండీ అద్దంకి మ్యూజిక్ డైరెక్ట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. 'గాడ్సే' చిత్రంలో చైత‌న్య కృష్ణ‌, పృథ్విరాజ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, నాగ‌బాబు కొణిదెల, బ్ర‌హ్మాజీ, నోయెల్ సీన్‌, ప్రియ‌ద‌ర్శి, నాజ‌ర్‌, సిజ్జు మీన‌న్ ముఖ్య పాత్రలు పోషించారు. స‌త్య‌దేవ్ న‌టించిన గాడ్సే  జూన్ 17న విడుద‌ల కానుంది. 

Read More:  ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు.. ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!