Godse Movie: 'గాడ్సే' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి

Published on Jun 18, 2022 07:45 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు (Hero Satyadev) సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా 'గాడ్సే' సినిమా రూపొందింది. అవినీతి రాజకీయాలపై బాధ్యత కలిగిన ఓ యువకుడి పోరాటం ఇది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకత్వం వహించాడు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి పరిచయమవుతోంది. 

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చురుకుగా పాల్గొంటోంది. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో ఐశ్వర్యలక్ష్మి (Actress Aishwarya Lakshmi) మాట్లాడుతూ.. "హీరోయిన్ గా నా కెరియర్ ను మలయాళ సినిమాతో మొదలుపెట్టాను. రెండో సినిమానే తెలుగులో చేయాల్సింది.. కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలోనే నా 15వ సినిమాను తెలుగులో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. 

'గాడ్సే' మూవీ (Godse Movie) లో నేను వైశాలి అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఈ మూవీ లోని పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీ, రొమాంటిక్ పాత్రలను చేయడం అంటే ఇష్టం. నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లు చేయడం ఇష్టం ఉండదు , అలాంటి పాత్రలు చేసే ఆలోచన కూడా లేదు అని తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.

Read More: Godse (గాడ్సే) : సత్యదేవ్ (Satyadev) సినిమా డిజిట‌ల్ రైట్స్‌కి అంత డిమాండా !