సమంత (Samantha) 'శాకుంతలం' (Shakuntalam) నుంచి బిగ్ అప్ డేట్.. గ్రాఫికల్ వర్క్ లో బిజీగా మూవీ యూనిట్..!

Updated on Aug 06, 2022 02:26 PM IST
తాజాగా శాకుంతలం నుంచి ఓ అప్ డేట్ (Shakuntalam Update) వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ గ్రాఫికల్ పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. 
తాజాగా శాకుంతలం నుంచి ఓ అప్ డేట్ (Shakuntalam Update) వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ గ్రాఫికల్ పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. 

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Actress Samantha) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం' (Shakuntalam). దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. మైథలాజికల్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక, ఈ మూవీలో సమంత శకుంతల పాత్రలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలి కాలంలో ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శాకుంతలం నుంచి ఓ అప్ డేట్ (Shakuntalam Update) వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ గ్రాఫికల్ పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. 

అంతే కాకుండా దీనితో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మేకర్స్ స్టార్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక, ఈ భారీ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు మణిశర్మ (Manisharma) మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు, గుణ టీం వర్క్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను తెరపై చూపించనున్నారు. శాకుంతలం కథను గుణ శేఖర్ (Director Gunasekhar).. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి తీసుకున్నాడు. ఇందులో మరో కీలక పాత్ర దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అన‌న్య నాగ‌ళ్ల‌, అల్లు అర్హ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  

ఇదిలా ఉంటే.. ప్రేక్షకుల్లో సమంత 'శాకుంతలం' ((Shakuntalam) Movie) సినిమాపై ఆసక్తిని తగ్గకుండా ఉండేందుకు గుణశేఖర్ భార్య నీలిమా గుణ తాజాగా ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేసింది. ‘శాకుంతలం’ సినిమా అందరూ మెచ్చే విధంగా అందించేందుకు తామెంతో కృషి చేస్తున్నామని.. సినిమా షూటింగ్ ముగిసినా, గ్రాఫిక్స్ వర్క్ కోసం చాలా సమయం పడుతుందని ఆమె పేర్కొంది. మంచి ఔట్‌పుట్ రావాలని తాము ప్రయత్నిస్తున్నామని.. అందుకే ఈ సినిమా రిలీజ్‌లో జాప్యం జరుగుతుందని ఆమె తెలిపింది.

Read More: బాలీవుడ్ లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సరసన అవకాశం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!