పెరుగుతున్న స‌మంత (Samantha) క్రేజ్.. ఇండియాలో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ సామేనా?.

Updated on Aug 21, 2022 06:21 PM IST
బాలీవుడ్ సెల‌బ్రిటీల కంటే స‌మంత (Samantha)కే క్రేజ్ పెరిగింద‌ట‌. అస‌లు సామ్ ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ అంటున్నారు. 
బాలీవుడ్ సెల‌బ్రిటీల కంటే స‌మంత (Samantha)కే క్రేజ్ పెరిగింద‌ట‌. అస‌లు సామ్ ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ అంటున్నారు. 

టాలీవుడ్‌లోకి 'ఏ మాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స‌మంత  (Samantha) టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నారు. స‌మంత న‌టించిన చాలా సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు సామ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా న‌టిస్తున్నారు. బాలీవుడ్ సెల‌బ్రిటీల కంటే స‌మంతకే క్రేజ్ పెరిగింద‌ట‌. అస‌లు సామ్ ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ అంటున్నారు. 

ఆర్మాక్స్ మీడియా టాప్-10 సెల‌బ్రిటీస్‌లో స‌మంత (Samantha) మొద‌టి స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీల‌ను వెన‌క్కు నెట్టి సామ్ మ‌రోసారి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచారు. మోస్ట్ పాపుల‌ర్ ఫీ మేల్ స్టార్ స‌ర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్ల‌డించింది. ఈ జాబితాలో స‌మంత టాప్ ప్లేస్‌లో స్థానం సంపాదించారు. స‌మంత త‌రువాతి స్థానంలో ఆలియాభ‌ట్‌, న‌య‌న‌తార‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఉన్నారు.

బాలీవుడ్ సెల‌బ్రిటీల కంటే స‌మంత (Samantha)కే క్రేజ్ పెరిగింద‌ట‌. అస‌లు సామ్ ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ అంటున్నారు. 

బిజీగా మారిన సామ్

ప్ర‌స్తుతం  స‌మంత  (Samantha) విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి 'ఖుషీ' సినిమాలో న‌టిస్తున్నారు. 'ఖుషీ' శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌ల కానుంది. అలాగే మ‌రో రెండు తెలుగు సినిమాలు కూడా ఆమె లిస్టులో ఉన్నాయి. 'శాకుంతలం', 'య‌శోద' సినిమాల‌తో స‌మంత ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లో రానున్నారు. ఇక హిందీ సినిమాల విష‌యానికి వ‌స్తే, వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి ఓ వెబ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 

 

బాలీవుడ్ సెల‌బ్రిటీల కంటే స‌మంత (Samantha)కే క్రేజ్ పెరిగింద‌ట‌. అస‌లు సామ్ ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ అంటున్నారు. 

సోష‌ల్ మీడియాకు దూరంగా స‌మంత!

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే స‌మంత ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. ఇంత‌కు ముందులా పోస్టులు పెట్ట‌డం లేదు. స‌మంత త‌న సినిమాల గురించి, యాడ్స్‌, లైఫ్ స్టైల్ విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ ఉండేవారు. ఇప్పుడు ముఖ్య‌మైన సినిమాల ట్వీట్లను లైక్ చేస్తున్నారు. గ‌తంలో ఉన్న‌ట్లు స‌మంత యాక్టీవ్‌గా లేరంటూ అభిమానులు అంటున్నారు. ఒక వేళ సినిమాల్లో బిజీగా ఉండి స‌మంత పోస్టులు పెట్ట‌డం లేద‌మోన‌ని కామెంట్లు పెడుతున్నారు.

Read More: బాలీవుడ్ లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సరసన అవకాశం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!