స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) ఇంట మొదలైన పెళ్లి సందడి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

Updated on Dec 02, 2022 02:23 PM IST
గుణశేఖర్ (Gunasekhar) కూతురు నీలిమ గుణ (Neelima Guna)ను పెళ్లి చేసుకోబోయే రవి ప్రఖ్యా ఓ బిజినెస్‌మెన్ అని సమాచారం
గుణశేఖర్ (Gunasekhar) కూతురు నీలిమ గుణ (Neelima Guna)ను పెళ్లి చేసుకోబోయే రవి ప్రఖ్యా ఓ బిజినెస్‌మెన్ అని సమాచారం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబయ్యారు. నీలిమ వివాహం కుదిరి చాలా రోజులు అవుతోంది. నేడు (శుక్రవారం) ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లికి ముందు జరిగిన వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖలు పాల్గొని.. కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

రవి ప్రఖ్యాతో నీలిమ గుణ వివాహం జరగనుంది. కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవాళ జరిగిన వేడుకలో ప్రముఖ రాజకీయ నేత కొండా సురేఖ పాల్గొన్నారు. కాగా, నీలిమ కాబోయే భర్త రవి ప్రఖ్యాత్ ఓ బిజినెస్‌మెన్ అని సమాచారం.  

ప్రస్తుతం ‘శాకుంత‌లం’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయట‌

ఇకపోతే, గుణశేఖర్ ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నారు. మన చరిత్రను కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇప్పటితరానికి తెలియజేసే విధంగా ఈ చిత్రాన్ని ఆయన తీస్తున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం ‘శాకుంత‌లం’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయట‌. ఈ మూవీలో భ‌ర‌తుడి రోల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలప‌ట్టి అల్లు అర్హ న‌టిస్తున్నారు. దుర్వాస మునిగా మోహ‌న్ బాబు, అనసూయ పాత్రలో అదితి బాలన్ యాక్ట్ చేస్తున్నారు. రాక్షసుడి క్యారెక్టర్‌లో కబీర్ దుల్హన్ సింగ్.. ఇక‌ మేనక రోల్‌లో మధు నటిస్తున్నారు. ఈ సినిమాను 3డీ టెక్నాలజీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘యశోద’ మూవీతో హిట్‌ను ఖాతాలో వేసుకున్న సమంత.. ఈ సినిమాతో మరో విక్టరీ కొట్టాలని చూస్తున్నారు. మరి, గుణశేఖర్‌‌‌‌‌‌‌‌–సమంత కాంబోలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Read more: Unstoppable 2: ‘అన్‌స్టాపబుల్’ షోలో పాన్ ఇండియా స్టార్!.. గోపీచంద్‌తో కలసి పాల్గొననున్న ప్రభాస్ (Prabhas)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!