ర‌వితేజ (Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ విడుద‌ల‌కు సిద్ధం.. నెల రోజుల్లో థియేట‌ర్ల‌లోకి ఎంట్రీ

Updated on Jun 23, 2022 01:09 PM IST
ర‌వితేజ (Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ప‌లు వాయిదాల త‌ర్వాత జూలై 29 న రిలీజ్ కానుంది.
ర‌వితేజ (Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ప‌లు వాయిదాల త‌ర్వాత జూలై 29 న రిలీజ్ కానుంది.

టాలీవుడ్‌లో త‌న న‌ట‌న‌తో మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్న  హీరో ర‌వితేజ (Ravi Teja). ర‌వితేజ న‌టించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుద‌ల ఎప్పుడో మేక‌ర్స్ తెలిపారు. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ప‌లు వాయిదాల త‌ర్వాత జూలై 29 న రిలీజ్ కానుంది. శ‌ర‌త్ మండ‌వ తొలి సారి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ర‌వితేజ న‌టించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌
రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అవినీతి రాజ‌కీయ నాయ‌కుల‌పై ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి ఎలా పోరాడ‌తాడ‌నే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. జనవరి నుంచి ఈ సినిమా వాయిదా ప‌డుతుంది. ఆ త‌ర్వాత జూన్ 17న రిలీజ్ చేస్తామని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అనుకున్న స‌మ‌యానికి ఈ సినిమా రిలీజ్ కాలేదు. ప్ర‌స్తుతం రామారావు ఆన్ డ్యూటీ విడుద‌ల తేదీ ఖ‌రారు కావ‌డంతో, ర‌వి తేజ అభిమానులు ఫుల్ జోష్‌తో ఉన్నారు. 

ర‌వితేజ(Ravi Teja) సినిమాల్లో యాక్ష‌న్, కామెడీతో పాటు పాట‌లు కూడా హిట్ టాక్ వ‌చ్చేలా ప్లాన్ చేస్తారు. ' రామారావు ఆన్ డ్యూటీ ' సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన బుల్ బుల్ త‌రంగ్ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే  నేనేనా.. నేనేనా.. అనే పాట యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. 

వాయిదాకు కార‌ణం
'రామారావు అన్ డ్యూటీ' షూటింగ్ అనుకున్నషెడ్యూల్‌లో పూర్తి కాలేద‌ట‌. అంతే కాకుండా  ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్త‌వ‌లేదు. దీంతో రిలీజ్ ఆల‌స్యం అయింద‌ని రీసెంట్‌గా మేక‌ర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ర‌వితేజ న‌టించిన 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29 న రిలీజ్ కానుంది.

Read More: Venkatesh : వెంకటేష్, రవితేజ కాంబినేషన్‌లో మల్టీస్టారర్! కథ రెడీ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !

ర‌వితేజ (Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ప‌లు వాయిదాల త‌ర్వాత జూలై 29 న రిలీజ్ కానుంది.


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!