Ramarao On Duty: 'రామారావు ఆన్ డ్యూటీ' తొలి రోజు క‌లెక్ష‌న్‌.. ర‌వితేజ (Ravi Teja) ఫ్యాన్స్ ఆగ్ర‌హం

Updated on Jul 31, 2022 01:41 PM IST
ర‌వితేజ (Ravi Teja) న‌టించిన‌ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.3.30 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబట్టింది.
ర‌వితేజ (Ravi Teja) న‌టించిన‌ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.3.30 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబట్టింది.

Ramarao On Duty: టాలీవుడ్ హీరో ర‌వితేజ (Ravi Teja) న‌టించిన‌ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం మొద‌టి రోజు క‌లెక్ష‌న్ భారీ షాక్‌ను క‌లిగించింది. మాస్ మ‌హారాజ ర‌వితేజ సినిమా అంటే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. కానీ 'రామారావు ఆన్ డ్యూటీ' మాత్రం క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. తొలి రోజే బాక్సాఫీస్ వద్ద డీలా ప‌డిన‌ ఈ చిత్రం ఇంకా ఎంత వ‌సూళ్లు చేయాల్సి ఉంది?. ర‌వితేజ ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు?.

ద‌ర్శ‌కుడిపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం

'రామారావు ఆన్ డ్యూటీ' యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంగా తెర‌కెక్కింది. ఈ సినిమాలో ర‌వితేజ (Ravi Teja) హీరోగా న‌టించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టించారు. ద‌ర్శ‌కుడు శరత్‌ మండవ తొలి సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ చిత్రాన్నిశ్రీ ల‌క్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత‌ సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా భారీ అంచ‌నాలతో జులై 29న రిలీజ్ అయింది. 

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా తొలి రోజు క‌లెక్ష‌న్ ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు కాలేదు. సినిమాపై నెగిటివ్ రివ్యూలు కూడా సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి. ఇక ర‌వితేజ ఫ్యాన్స్ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ర‌వితేజ‌కు సెట్ అయ్యే క‌థతో సినిమాను తెర‌కెక్కించ‌లేదంటూ ద‌ర్శ‌కుడిపై మండిప‌డుతున్నారు.

 

ర‌వితేజ (Ravi Teja) న‌టించిన‌ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.3.30 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబట్టింది.

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తొలి రోజు కలెక్షన్స్‌..

  • నైజాం - రూ.85 లక్షలు
  • సీడెడ్ - రూ.52 లక్షలు
  • ఈస్ట్ - రూ.31 లక్షలు
  • వెస్ట్ - రూ.16 లక్షలు
  •  ఉత్త‌రాంధ్ర - రూ.45 లక్షలు
  • గుంటూరు- రూ.24 లక్షలు
  • కృష్ణా - రూ.17 లక్షలు
  •  నెల్లూరు - రూ.12 లక్షలు
  • రెస్టాఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ - రూ.58 లక్షలు
  •  ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం కేవలం రూ.3.30 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.2.82 కోట్లు వ‌సూళ్లు చేసింది. ర‌వితేజ (Ravi Teja) రీసెంట్ సినిమాల‌ ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... 'ఖిలాడీ' రూ. 4.30 కోట్లు, 'క్రాక్' రూ. 6.25, 'డిస్కో రాజా' రూ.2.54 'అమర్ అక్బర్ ఆంటోని' రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మొత్తం రూ.18 కోట్ల షేర్‌ను రాబట్టాలి.

Read More: Ramarao on duty Trailer: 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి మాస్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన రవితేజ (Raviteja)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!