Ramarao On Duty: చీఫ్ గెస్టుగా పిలిచారని రాలేదు.. రవితేజపై అభిమానంతో వచ్చా: హీరో నాని (Naturalstar Nani)
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సినిమా రిలీజ్ అవుతోందంటే అభిమానుల్లో ఆ జోషే వేరుగా ఉంటుంది. రవితేజ తాజా చిత్రమైన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Ramarao On Duty Pre Release Event) నిన్న రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ప్రత్యేక అతిథిగా దర్శకుడు బాబీ హాజరయ్యారు.
'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ వేడుకలో నాని (Natural Star Nani) మాట్లాడుతూ.. "చీఫ్ గెస్టుగా పిలిచారని నేను ఇక్కడికి రాలేదు. రవన్నయ్య గురించి నాలుగు మాటలు మాట్లాడవచ్చని వచ్చాను. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కి తనకి చిరంజీవిగారు ప్రేరణ అయితే, నేను ఇండస్ట్రీకి రావడానికి రవితేజ నాకు స్ఫూర్తి. మెగాస్టార్ తో చేసే అవకాశం రవన్నయ్యకి వచ్చినట్టే, తనతో కలిసి నటించే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా తాను ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు.
‘రవితేజ (Ravi Teja) అన్నయ్యకు చిరంజీవి గారు స్ఫూర్తి అయితే నాకు రవితేజ స్ఫూర్తి. ‘నేను అనుకున్నది సాధించాను.. నువ్వు ఎందుకు సాధించలేవ్’ అని ధైర్యాన్నిచ్చే రవితేజలాంటి నటులు ప్రతి తరానికీ ఒకరుంటారు’ అని నాచురల్ స్టార్ నాని (Nani) అన్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి (Actor Venu Thottempudi) గురించి నాని మాట్లాడుతూ.. అప్పట్లో 'హనుమాన్ జంక్షన్' సినిమాలో ఎల్బీ శ్రీరామ్ గారితో ఆవు ఎపిసోడ్ సీన్ తనకు ఎంతగానో ఇష్టమని పేర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.. కచ్చితంగా మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను అని నాని తెలిపారు.
‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాని అంటే నాకు చాలా ఇష్టం. సౌత్‌లో ఉన్న గొప్ప నటుల్లో నాని ఒకరు. వేణుతో కలిసి ‘స్వయంవరం’ సినిమా చేయాలి. అప్పుడు మిస్ అయ్యా. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కుదిరింది. దర్శకుడికి తొలి సినిమాలా అనిపించదు. ఈ టీమ్‌తో మొదటిసారి పనిచేశా. అందరూ ఈ సినిమాకు వందశాతం న్యాయం చేశారు’ అని రవితేజ (Ravi Teja) చెప్పారు.
ఇక చివర్లో బాబీ (Director Bobby) మాట్లాడుతూ.. రవితేజ చేసిన హెల్ప్ వల్లనే తాను ఇండస్ట్రీలో నిలబడగలిగానని అన్నాడు. ఆయన సహకారం వల్లే ఎన్టీఆర్ తో ' జై లవకుశ' చేయగలిగినట్టు చెప్పాడు. దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ.. ట్విట్టర్ రివ్యూలు చూడటం మానేసి థియేటర్లకి వెళ్లండి .. ట్విట్టర్లలో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి అని అన్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై ముగ్గురు కథానాయికలు అందంగా మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Read More: 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఒకే స్టేజిపై రవితేజ, నాని (Raviteja, Nani)..!