The Warriorr : 'ది వారియర్' దర్శకుడు లింగుస్వామి (N. Lingusamy)కి జైలు శిక్ష!.. చెక్ బౌన్స్ కేసులో తీర్పు
The Warriorr : టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన 'ది వారియర్' సినిమా దర్శకుడు లింగుస్వామి (N. Lingusamy)కి కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసు కారణంగా లింగుస్వామికి శిక్ష వేసింది. ఆరు నెలల పాటు లింగు స్వామికి, అతని తమ్ముడికి జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. లింగుస్వామి కేసు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాప్‌క్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
హీరో కార్తీ, హీరోయిన్ సమంతలతో లింగుస్వామి (N. Lingusamy) ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాణం కోసం లింగుస్వామి, అతని తమ్ముడు సుభాష్ చంద్రబోస్ పీవీపీ సినిమాస్ దగ్గర అప్పు తీసుకున్నారు. దాదాపు రూ. 35 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే వీరు ఏ సినిమా కోసం అప్పు తీసుకున్నారో.. ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే అప్పుగా తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి ఇచ్చారు.
హైకోర్టులో పిటిషన్ వేస్తారా?.
The Warriorr : లింగుస్వామి ఇచ్చిన చెక్.. చెక్ బౌన్స్ అవడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు వీరికి ఆరునెలల జైలు శిక్ష విధించింది. లింగుస్వామి తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో లింగుస్వామి పిటిషన్ వేయనున్నారు. మమ్ముట్టి నటించిన ఆనందం సినిమాతో దర్శకుడిగా పరచయం అయ్యారు లింగుస్వామి. ఆ తరువాత వచ్చిన సినిమాల హిట్‌లతో స్టార్ దర్శకుడిగా మారారు. లింగుస్వామికి తిరుపతి బ్రదర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ప్రస్తుతం లింగుస్వామి చెక్ బౌన్స్ కేసు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది,
Read More: The Warriorr: 'ది వారియర్' వసూళ్లు పెరిగేనా.. నిరాశలో రామ్ పోతినేని(Ram pothineni)!!!