రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న 'ది వారియర్' (The Warriorr) చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు

Updated on Jul 11, 2022 01:55 PM IST
రామ్ పోతినేని (Ram Pothineni),   శింబు .. వీరిద్దరూ దక్షిణాది పరిశ్రమలో మంచి స్నేహితులు
రామ్ పోతినేని (Ram Pothineni), శింబు .. వీరిద్దరూ దక్షిణాది పరిశ్రమలో మంచి స్నేహితులు

టాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం కోలీవుడ్‌లో కూడా పాగా వేయడానికి సిద్ధమయ్యారు. ఈయన హీరోగా నటించిన ‘ది వారియర్‌’ (The Warriorr) చిత్రం తమిళంలో కూడా తెలుగుతో పాటు సమాంతరంగా రూపొందింది. ఈ చిత్రంతో రామ్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. 

ఈ నెల 14వ తేదిన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాను శ్రీనివాస స్టూడియోస్ పతాకం పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించారు. అలాగే టాప్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించారు. కృతిశెట్టి (Kriti Shetty) కూడా ఈ చిత్రం ద్వారానే తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. 

ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమాలో 'బుల్లెట్' సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. 

'బుల్లెట్' సినిమా సాంగ్‌ను శింబు పాడడం గమనార్హం. ఇటీవలే రామ్ చెన్నైకి సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లగా.. అక్కడ శింబును ప్రత్యేకంగా కలవడం గమనార్హం. ఈ సందర్భంగా, ఈ ఇద్దరు హీరోలు కాసేపు మచ్చటించుకున్నారు. 

రామ్ పై శింబు ప్రశంసలు

ఈ క్రమంలో శింబు హీరో రామ్‌ను ప్రశంసలలో ముంచెత్తారు. రామ్ పోతినేని (Ram Pothineni) స్టైలిష్ లుక్ చాలా బాగుందని కితాబిచ్చారు. అలాగే తన సినిమాలో 'బుల్లెట్' సాంగ్ పాడినందుకు రామ్ శింబుకి ధన్యవాదాలు తెలిపారు. ఆ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలిపారు.

శింబు తెలుగు వారికీ సుపరిచితుడే

శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో ఈయన నటించిన తమిళ సినిమాలు ఎన్నో తెలుగులో కూడా డబ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యాయి. కుర్రాడొచ్చాడు, మన్మధ, వల్లభ లాంటి సినిమాలు శింబుకు తెలుగు మార్కెట్‌లో కూడా లాభాలు తీసుకొచ్చి పెట్టాయి. 

ఇక రామ్ పోతినేని (Ram Pothineni) విషయానికి వస్తే, ఇప్పటికే ఆయనకు తెలుగులో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. రెడీ, కందిరీగ, నేను శైలజ, పండగ చేస్కో, ఉన్నది ఒక్కటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈయన "ది వారియర్" సినిమాలో నటిస్తున్నారు. 

Read More: The Warrior: త‌మిళ‌నాడులో రామ్ దూకుడు ! 'ది వారియ‌ర్' ప్రీ రిలీజ్ వేడుక‌కు 28 కోలీవుడ్ సెల‌బ్రిటీలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!