The Warrior Movie: 'ది వారియర్' మూవీ ప్రమోషన్స్.. క్రేజీ లుక్ లో రామ్ పోతినేని, కృతి శెట్టి (Krithi Shetty)..!

Published on Jul 09, 2022 07:42 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన 'ది వారియర్' (The Warrior Movie) సినిమా విడుదల తేదీ దగ్గరపాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, కొన్ని పాటలు విడుదల చేయగా అన్నీ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. 

'ది వారియర్' (The Warrior Movie) సినిమా తమిళ తెలుగు భాషలలో ఏకకాలంలో రూపొందింది. ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. ఇక, ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది.  సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి టీజర్, కొన్ని పాటలు విడుదల చేయగా అన్నీ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి.    

కృతి శెట్టి టీవీ యాడ్స్ లో నటిస్తూ 17 ఏళ్ల వయసులోనే హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'సూపర్ థర్టీ' అనే సినిమాలో ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అనూహ్యంగా ఆమెకు 'ఉప్పెన' (Uppen Movie) సినిమా ఆఫర్ లభించింది. 

ఇక జులై 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ది వారియర్ (The Warrior Movie) మూవీ ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ ధరకు కొనుగోలుచేసారు. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

Read More: Ram pothineni: రామ్ పోతినేని న‌టించిన 'ది వారియ‌ర్' ప్రత్యేకతలు ఇవే! ఈ సినిమా టాప్ 10 విశేషాలు మీకోసం !