Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' షూటింగ్‌కు సిద్ధమైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
Hari Hara Veera Mallu: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ప్రత్యేకమైంది. పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో 'హరిహర వీరమల్లు' చిత్రం తెరకెక్కుతోంది. పవన్ గ్లాన్స్ అనే పేరుతో ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. 'హరిహర వీరమల్లు' చిత్రం నుంచి రిలీజ్ అయిన పవన్ గ్లాన్స్ వీడియోలో పవన్ కల్యాణ్ నటన ఓ రేంజ్‌లో ఉంది.
పవన్ రెడీ
పాన్ ఇండియా సినిమాగా 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మొదటి సారి తన సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయనున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
పవన్ కల్యాణ్ సినిమా కోసం అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమాను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారట. అందుకు పవన్ కల్యాణ్ కూడా షూటింగ్ కోసం తన డేట్స్ ఇచ్చారట. ఈ అప్‌డేట్‌తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సమ్మర్‌లో రిలీజ్
పదిహేడవ శతాబ్దం నాటి కథతో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు రాని కథగా 'హరిహర వీరమల్లు' సినిమాను చిత్రీకరిస్తున్నామని క్రిష్ తెలిపారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా 'హరిహర వీరమల్లు' చిత్రం 2023 సమ్మర్‌కు రిలీజ్ కానుంది.