నితిన్ (Nithiin)ను స‌న్మానించిన‌ బీజేపీ నేత‌ జేపీ నడ్డా.. తెలుగు హీరోల‌కు గాలం వేస్తున్న పార్టీలు !

Updated on Aug 28, 2022 08:20 PM IST
నితిన్  (Nithiin) న‌టించే సినిమాలు హిట్ సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు జేపీ న‌డ్డా సోష‌ల్ మీడియాలో తెలిపారు. 
నితిన్ (Nithiin) న‌టించే సినిమాలు హిట్ సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు జేపీ న‌డ్డా సోష‌ల్ మీడియాలో తెలిపారు. 

టాలీవుడ్ హీరో నితిన్‌ (Nithiin)ను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (JP Nadda) స‌న్మానించారు. బీజేపీ నేత‌లు టాలీవుడ్ హీరోల‌తో భేటీ  అవ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్టీఆర్‌ను క‌లిశారు. ప్ర‌స్తుతం హీరో నితిన్, బీజేపీ నేత న‌డ్డాల భేటీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ అసలు రహస్యం ఏమిటి?.

రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చ‌

నితిన్ (Nithiin) న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ఇటీవ‌లే రిలీజ్ అయింది.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం.. నితిన్‌కు అనుకున్నంత స‌క్సెస్ ఇవ్వ‌లేదు. ఇదే క్రమంలో తాజాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, టాలీవుడ్ యువ హీరో నితిన్‌తో సమావేశం అయ్యారు. వీరిద్ద‌రి మ‌ధ్య పలు రాజ‌కీయ అంశాల‌పై చర్చ జ‌రిగింది.

అలాగే ప‌లు సామాజిక, సినిమా అంశాల‌పై కూడా నితిన్, న‌డ్డాలు మాట్లాడారు. ఈ విష‌యాన్ని జేపీ న‌డ్డా త‌న సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా తెలిపారు. నితిన్ న‌టించే సినిమాలు హిట్ సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు జేపీ న‌డ్డా త‌న పోస్ట్‌లో తెలిపారు. 

 

హీరోల‌కు బీజేపీ గాలం

యువ హీరో నితిన్ (Nithiin) లేటెస్ట్ మాస్ యాక్షన్ 'మాచర్ల నియోజకవర్గం' 950  థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సినిమా విడుద‌ల‌కే ముందు అభిమానులకు ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  కానీ ఇదే చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. ఇక నితిన్‌ను బీజేపీ నేత‌లు క‌ల‌వ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలుగు హీరోల‌కు బీజేపీ గాలం వేస్తుందంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ పార్టీలు హీరోల‌ను కాకా ప‌డుతున్నాయంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. 

Read More: ఆస్కార్‌ అవార్డుల ప్రెడిక్షన్ జాబితాలో ఎన్టీఆర్‌ (NTR).. యంగ్ టైగర్‌కు విందు ఇవ్వ‌నున్న‌ కేంద్ర హోం మంత్రి !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!